బుల్లితెర బిగ్ షో బిగ్బాస్ 4 ఎంతో మంది యువ కళాకారులకు టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేస్తోంది. గతంతో మూడు సీజన్లలో ప్రేక్షకులను అలరించిన ఎంతో మంచి సెలబ్రిటీలు తమకు అందివచ్చిన అవకాశాలను వినియోగించుకంటూ కెరీర్ లో దూసుకెళ్తున్నారు. లేటస్ట్ గా బిగ్ బాస్4 హౌజ్ లో ఉన్నది కొద్దిరోజులే అయినా ప్రేక్షకులకు చేరువైంది ముద్దుగుమ్మ దివి. తన కొంటె చూపులతో..కవ్వింపు సొగసులతో కంటెస్టెంట్లనే కాదు ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో అమ్మడి క్రేజ్ పెరిగింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ భామకు మంచి మంచి అవకాశాలు అందిస్తున్నాయి. మహర్షి సినిమాలో మహేష్ బాబు పక్కన చిన్న పాత్రలో నటించిన దివికి, ఇప్పుడు మెగాస్టార్ పక్కన నటించే బంపర్ ఆఫర్ లభించింది.
అది ఏకంగా మెగాస్టారే ఈ ఆఫర్ను ప్రకటించడంతో అమ్మడి ఆనందానికి అవధులే లేకుండా పోయాయి. బిగ్ బాస్ 4 ఫినాలే అంగరంగ వైభవంగా ముగిసింది. ఈ ఫినాలేకు మెగాస్టార్ చిరెంజీవి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. అట్టహాసంగా జరిగి బిబి4 కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున ఎంటర్టైన్ మెంట్ డోస్ పెంచి ఆడియన్స్ ను అలరించడం జరిగింది. అదే విధంగా కంటెస్టెంట్స్ యొక్క కోరికలకు మద్దతు పలికారు స్టార్ హీరోలు. ఇందులో భాగంగా ముద్దుగుమ్మ దివికి తనతో నటించే అవకాశం ఇచ్చారు చిరు. మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాళం రీమేక్ లో తాను నటిస్తున్నాని రివీల్ చేయడంతో పాటు ఈ ప్రాజెక్టులో దివికి మంచి రోల్ ఇస్తానని ప్రామిస్ చేశారు చిరంజీవి.
త్వరలో మనం ఇద్దరం కలుద్దామని చిరంజీవి తెలపడంతో అమ్మడి ముఖంలో సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఈ సినిమా మరో 8 లేదా 9 నెలల్లో ప్రారంభం కానుంది. దీంతో అమ్మడు మూవీ కోసం సిద్ధమవుతోంది. వేదాళం రీమేక్ మూవీలో దివి ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనుందని వార్తలు వస్తున్నాయి. ఇదే కాదు తెలుగు ఇండస్ట్రీ నుంచి దివికి మంచి ఆఫర్స్ అందివస్తున్నాయి. రెండు మూడు చిత్రాల్లో దివి హీరోయిన్ గా సెలక్ట్ అయ్యిందంటూ పుకార్లు షికార్లు కొడుతున్నాయి. త్వరలోనే దర్శక, నిర్మాతలు ఈ మూవీలను రివీల్ చేయనున్నారు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!