Bobby : బాబి టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. మాస్ మహారాజ రవితేజ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ లతో ఇప్పటికే తీసిన సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ఈ క్రమంలో ఆయన కథ కథనం, సినిమాను తెరకెక్కించే విధానం ఏకంగా మెగాస్టార్ చిరంజీవి ఆకట్టుకోవడంతో బాబికి తనతో సినిమా చేసే అవకాశం ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ తో సినిమా చేసిన బాబీ మెగాస్టార్ తో సినిమా చేసే అవకాశం అందుకుంటాడని మాత్రం ఏ ఒక్కరు ఊహించలేదు. అంటే మెగాస్టార్ ని బాబి తన కథతో ఎంతగా ఆకట్టుకున్నాడో, ఈ కథ మీద మెగాస్టార్ కి ఎంత నమ్మకం లేకపోతే బాబికి అవకాశం ఇస్తాడు.
అయితే బాబి మెగాస్టార్ ని అంతగా ఆకట్టుకునే కథ ఏంటా అని అందరూ ఎంతో ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఈ సినిమా కథకు ఇస్పిరేషన్ మెగాస్టార్ అని బాబి వెల్లడించాడు. మెగాస్టార్ కి ఉన్న స్టార్ డమ్ ని ఆదర్శంగా తీసుకునే ఈ కథ రాసినట్టు, తెరకెక్కించబోతున్నట్టు హింట్ ఇచ్చాడు. మెగాస్టార్- తన అభిమాని మధ్య ఉండే ఎమోషనలో బాండింగ్ తో ఈ సినిమా రూపొందించనున్నట్టు తెలిపాడు బాబి. ఓ సాధారణ మెగా అభిమాని ఎలా ఉంటాడు? ఆ అభిమాని పట్ల ఓ స్టార్ ఎలా ఫీల్ అవుతారు? అన్న అంశాన్ని సినిమాలో కీలక అంశంగా హైలైట్ చేయనున్నారట.
Bobby : బాలీవుడ్ బ్యూటి సోనాక్షి సిన్హ ను ఎంపిక చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
దీనికి కమర్షియల్ అంశాలను జోడించి మెగాస్టార్ ఇమేజ్ కి తగ్గట్టుగా భారీ స్థాయిలో తెరకెక్కించనున్నారట. ఇక ఈ సినిమాను గతంలో మెగాస్టార్ నటించిన బ్లాక్ బస్టర్స్ గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు సినిమాల తరహాలో కథ సాగుతుందని రెట్టింపు స్థాయిలో సక్సెస్ అయ్యేందుకు భారీ పక్కా స్క్రిప్ట్ తో రెడీగా ఉన్నట్టు తెలిపాడు. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటి సోనాక్షి సిన్హ ను ఎంపిక చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మెగాస్టార్ నటించిన ఆచార్య దాదాపు పూర్తి కావచ్చింది. ఈ నెలలోనే మలయాళ సూపర్ హిట్ లూసీఫర్ తెలుగు రీమేక్ మొదలు పెట్టనున్నారు. ఆ తర్వాత బాబి సినిమా ఉండనుంది.