అందరు వద్దన్నా మెహర్ రమేష్ తో మెగాస్టార్ సినిమా ఒకే చేసింది అందుకే.. ఇండస్ట్రీ రికార్డ్స్ అన్ని బద్దలే..!

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న ఆచార్య సినిమా కూడా సమ్మర్ కి రిలీజ్ చేస్తామని మేకర్స్ అధికారకంగా మోషన్ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడే వెల్లడించారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. రాం చరణ్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. చరణ్ కి జంటగా రష్మిక మందన్న నటించే అవకాశాలున్నాయని టాక్ వినిపిస్తుండగా మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతమందిస్తున్నాడు. ఇప్పటికే 40 శాతం టాకీ ఆర్ట్ కంప్లీటయిన ఈ సినిమాని కొరటాల అక్టోబర్ లో మళ్ళీ సెట్స్ మీదకి తీసుకు వెళ్ళబోతున్నాడు.

Acharya' First Look: Megastar Chiranjeevi stands tall in the new poster of his upcoming film

అయితే ఈ షెడ్యూల్ 15 రోజుల పాటు జరిపాక అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటే మెగాస్టార్ సెట్స్ లో అడుగుపెడతారని అంటున్నారు. కాగా ఇప్పటికే వినాయక్, మెహర్ రమేష్ లతో మెగాస్టార్ బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలని చేయాలని డిసైడయిన సంగతి తెలిసిందే. మలయాళ సూపర్ హిట్ కి వి.వి.వినాయక్ దర్శకత్వం వహించబోతుండగా ఈ సినిమాకి సంబంధించిన అధికారక ప్రకటన రానుందని సమాచారం.

Chiranjeevi's Bald Look: Vedalam Remake or Aha web series?

ఇక తమిళంలో సూపర్ హిట్ అయిన వేదాళం రీమేక్ ని తెరకెక్కించే బాద్యత మెహర్ రమేష్ కి అప్పగించారు మెగాస్టార్. అందరు మెహర్ రమేష్ తో సినిమా వద్దని కన్‌ఫర్‌మేషన్ వచ్చినప్పటినుంచి మెగా అభిమానులు అంటున్నారు. కాని మెగాస్టార్ మాత్రం మెహర్ రమేష్ మీద చాలా నమ్మకంగా ఉన్నారట. అందుకు కారణం మెహర్ ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ అధ్బుతంగా ప్లాన్ చేసి మెగాస్టార్ ని విపరీతంగా ఇంప్రెస్ చేయడమే ముఖ్య కారణం అని తెలుస్తుంది. ఇక మెహర్ రమేష్ ప్రభాస్ తో తీసిన బిల్లా సినిమాలో హాలీవుడ్ రేంజ్ లో యాక్షన్ సీన్స్ ని తీసిన సంగతి తెలిసిందే.