Allu arjun : అల్లు అర్జున్ కి పోటీగా మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నారా.. తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే మాట వినిపిస్తోంది. అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా పుష్ప. అల్లు అర్జున్ కెరీర్ లో ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా. సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా.. రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ మైత్రీ మూవీ మేకర్స్, ముత్యంశెట్టి మీడియా బ్యానర్‌పై ఈ సినిమాని దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నట్టు అధికారకంగా ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ ఏడాది ఆగస్టు 13న పుష్ప సినిమా రిలీజ్ చేసేందుకు డేట్ కూడా ఫిక్స్ చేశారు. రీసెంట్గా ఈ సినిమా నుంచి ఇంట్రో వీడియో రిలీజ్ చేయగా రికార్డ్స్ క్రియేట్ చేసింది. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఇండస్ట్రీలో అన్నీ సినిమాలన్నీ గత ఏడాది మాదిరిగానే పోస్ట్ పోన్ చేస్తున్న సంగతి తెలిసిందే. మళ్ళీ అన్నీ సినిమాలకి సోలో రిలీజ్ డేట్ దొరకడం కష్టమే. అంతేకాదు ఒక సినిమా ఒక సినిమాకి బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ నెలకొనడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తోంది. అలాగే పుష్ప సినిమా చుటూ గట్టి పోటీనే ఉండేలా కనిపిస్తుందట.
Allu arjun : అల్లు అర్జున్ పుష్ప సినిమాకి మెగాస్టార్ ఆచార్య సినిమా పోటీ కానుందా..?
ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాయే పుష్ప కి పోటీ అయ్యే అవకాశాలున్నట్టు చెప్పుకుంటున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రాం చరణ్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. నిజంగా ఆచార్య వర్సెస్ పుష్ప అయితే మెగా అభిమానుల్లో ఉత్కంఠత ఎలా ఉంటుందో మాటల్లో చెప్పడం చాలా కష్టం. మరి నిజంగా అల్లు అర్జున్ పుష్ప సినిమాని మెగాస్టార్ ఆచార్య సినిమా పోటీ కానుందా లేదా కొన్ని రోజులు ఆగితేగాని క్లారిటీ రాదు.