Megha Akash: మేఘా ఆకాష్‌కు అవకాశాలు వస్తున్నాయి గానీ..అవి ఆమెకు ఎందుకు పనికి రావడం లేదు..?

Share

Megha Akash: టాలీవుడ్‌లో మంచి క్రేజీ హీరోయిన్ అయ్యేందుకు అన్నీ ప్రయత్నాలు చేస్తోంది యంగ్ బ్యూటీ మేఘా ఆకాష్. తెలుగులో యంగ్ హీరో నితిన్ నటించిన లై సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది మేఘా ఆకాష్. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా రిలీజ్‌కు ముందు బాగా హైప్ వచ్చింది. ముఖ్యంగా మేఘా పోస్టర్స్‌లో టీజర్, ట్రైలర్‌లో చాలా క్యూట్‌గా ఉందనే కామెంట్స్ వినిపించాయి. అయితే లై మూవీ రిలీజయ్యాక ఫ్లాప్ టాక్ రావడంతో మేఘా ఆశలన్నీ ఆవిరయ్యాయి. అయినా ఈ బ్యూటీకి నితిన్ మరో ఛాన్స్ ఇచ్చాడు.

megha-akash-unable-to-utilise-offers
megha-akash-unable-to-utilise-offers

పవన్ కళ్యాణ్, నితిన్ సొంత బ్యానర్స్‌లో ఛల్ మోహన్ రంగ అనే సినిమా వచ్చింది. ఈ సినిమాకి త్రివిక్రం కథ అందివ్వడంతో పాటు నిర్మాణంలోనూ భాగస్వామిగా ఉన్నాడు. పవర్ స్టార్ కూడా ఓ నిర్మాత కావడంతో ఛల్ మోహన రంగ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా మీద రిలీజ్ కు ముందు వదిలిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్.. లిరికల్ సాంగ్స్ బాగా హైప్ పెంచాయి. కానీ థియేటర్స్‌లో వచ్చాక మాత్రం అట్టర్ ఫ్లాప్ అనే టాక్ తెచ్చుకుంది. అంతేకాదు దీనికంటే ముందు వచ్చిన లై సినిమానే కాస్త నయం అని చెప్పుకున్నారు.

 

Megha Akash: మేఘా ఆకాష్‌ను బ్యాడ్ లక్ ఏ ఇండస్ట్రీలోకి వెళ్ళినా వెంటాడింది.

దాంతో ఇక మేఘా ఆకాష్‌కు తెలుగులో అవకాశాలు దక్కలేదు. ముందు రెండు సినిమాలలో ఏ ఒక్కటి మంచి హిట్ అయినా త్రివిక్రం వదిలేవాడు కాదు. ఏదో యంగ్ హీరో సినిమాకు రిఫర్ చేసేవారు. కానీ రెండు సినిమాలు ఫ్లాపవడంతో ఫ్లాప్ హీరోయిన్ అనే ముద్ర పడింది. దాంతో ఆయన రిస్క్ చేసి ఒప్పిద్దామనుకున్నా సెంటిమెంట్ ఫాలో అయ్యే నిర్మాతలు మాత్రం సున్నితంగా నో అనేవారు. ఆ తర్వాత కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన పేట సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించింది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా మిగిలింది.

దాంతో అమ్మడు పెట్టుకున్న ఆశలు తమిళ ఇండస్ట్రీలో కూడా వర్కౌట్ కాలేదు. ఇక హిందీలో శాటిలైట్ శంకర్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ సినిమా ఎప్పుడు వచ్చిందో కూడా ఎవరికీ తెలీదు. అలా పాపం మేఘా ఆకాష్‌ను బ్యాడ్ లక్ ఏ ఇండస్ట్రీలోకి వెళ్ళినా వెంటాడింది. అయినా ఎలాగోలా తమిళం నుంచి అవకాశాలు అందిపుచ్చుకుంది. అంతేకాదు హిందీలో కూడా సల్మాన్ ఖాన్ దిశా పఠానీ నటించిన రాధే సినిమాలో ఓ రోల్ చేసింది. దీనితో ఆమెకు అంతగా ఒరిగిందేమీ లేదనే చెప్పాలి.

Megha Akash: పెద్ద హీరో సినిమాలో మాత్రం హీరోయిన్‌గా మేఘా అవకాశం దక్కించుకోలేకపోతోంది.

అయితే అదృష్ఠం కొద్దీ ఇటీవల తెలుగులో వచ్చిన రెండు సినిమాలు ఓ మోస్తారు విజయాన్ని అందుకొని కాస్త అవకాశాలు వచ్చేలా చేస్తున్నాయి. యంగ్ హీరో శ్రీవిష్ణు నటించిన రాజ రాజ చోర సినిమాలో నటించిన మేఘా ఆకాష్ ఓ హిట్ అందుకుంది. ఆ తర్వాత వచ్చిన డియర్ మేఘ కూడా పరవాలేదనిపించుకుంది. దాంతో ఆమెకు మను చరిత్ర, గుర్తుందా శీతాకాలం అనే సినిమాలలో నటించే ఛాన్స్ దక్కింది. అంతేకాదు ఓ తమిళ సినిమా, మరో తమిళ, తెలుగు సినిమాకు సైన్ చేసింది. ప్రస్తుతం ఈ నాలుగు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. అయితే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పెద్ద హీరో సినిమాలో మాత్రం హీరోయిన్‌గా మేఘా అవకాశం దక్కించుకోలేకపోతోంది.

 

 


Share

Related posts

Lock Down బిగ్ బ్రేకింగ్ : తెలంగాణ లాక్ డౌన్ న్యూస్ పై క్లారిటీ ఇచ్చిన మంత్రి..!!

sekhar

యుపీ ఐఎఎస్ చంద్రకళ ఇంటిపై సీబీఐ సోదాలు

somaraju sharma

వాళ్ళ ముందే నన్ను అక్కడ పట్టుకున్నాడు… చెంప పగలగొట్టాను : అరియానా

arun kanna