మాఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు దేశ రాజకీయ వర్ఘాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. ఇప్పటికే బీజేపీ అధిష్టానం నిర్ణయాలపై ఆ పార్టీ పార్లమెంట్ సభ్యుడు వరుణ్ గాంధీ పలు సందర్భాల్లో విమర్శలు ఎక్కుపెడుతుండగా, ఆయన సరసన మేఘాలయ గవర్నర్ సత్యపాలిక్ మాలిక్ కూడా తోడయినట్లు కనబడుతోంది. ఉప రాష్ట్రపతి పదవి గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైయ్యాయి. తాను జమ్ము కశ్మీర్ కు గవర్నర్ గాా ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకపోయి ఉంటే ఉప రాష్ట్రపతి గా ఎన్నిక అయ్యేవాడినని అన్నారు. ఉప రాష్ట్రపతి పదవి తనకే ఇస్తున్నారనే సూచనలు అంతకు ముందు అందినప్పటికీ, తనకు నచ్చని విషయాలపై మాట్లాడకుండా ఉండలేకపోయానని పేర్కొన్నారు. జమ్ము కశ్మీర్ గవర్నర్ గా ఉన్న సమయంలో ఆయన కేంద్ర ప్రభుత్వ విధానాలను విమర్శించడంతో కేంద్రం ఆయన పై ఫోకస్ పెట్టి మోఘాలయ గవర్నర్ గా బదిలీ చేసింది.

అయితే సత్యపాల్ మాలిక్ కేంద్రంపై కేంద్రంపై సంచలన కామెంట్స్ చేశారు. దేశంలో జరుగుతున్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులపై స్పందిస్తూ .. ఈడీ దాడులు ఎక్కువగా ప్రతిపక్ష నేతలపైనే జరుగుతున్నాయనీ, నిజానికి ఈడీ దాడులు ఎదుర్కోవాల్సిన వాళ్లలో బీజేపీ నాయకులు కూడా ఉన్నారని బాంబు పేల్చారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రపైనా ఆయన సంచలన కామెంట్స్ చేశారు. రాహుల్ గాంధీ పై బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్న క్రమంలో సత్యపాల్ మాలిక్ మాత్రం రాహుల్ పై ప్రశంసలు జల్లు కురిపించడం జాతీయ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. రాహుల్ గాంధీ తన పార్టీ కోసం మంచి పని చేస్తున్నారని ప్రశంసించడంతో పాటు రైతు సమస్యలపైనా స్పందించారు సత్యపాల్ మాలిక్. రైతులకే తన మద్దతు అంటూ ప్రకటించారు. వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరను కేంద్రం అమలు చేయకపోతే తానే రైతులకు మద్దతుగా ఆందోళన చేపడానంటూ వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించారు సత్యపాల్ మాలిక్.
తెలంగాణ సీఎం కేసిఆర్ తో కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి భేటీ
‘బడ్జెట్ లో ఏపికి మొండి చేయి!’