Mehaboob : మెహబూబ్ గురించి తెలుసు కదా. మెహబూబ్ అనడం కన్నా… బిగ్ బాస్ మెహబూబ్ అంటే ఈజీగా గుర్తు పట్టేస్తారు. లేదా మెహబూబ్ దిల్ సే అన్నా కూడా ఈజీగా గుర్తు పట్టేస్తారు. సోషల్ మీడియాలో మెహబూబ్ ఒక సంచలనం. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. సోషల్ మీడియాలో మెహబూబ్ కు మిలియన్స్ కొద్దీ ఫాలోయర్స్ ఉన్నారు.

సోషల్ మీడియాలో స్టార్ కాబట్టే.. మెహబూబ్ కు బిగ్ బాస్ 4 లో అవకాశం వచ్చింది. బిగ్ బాస్ 4 లో ఎప్పుడైతే అవకాశం వచ్చిందో మెహబూబ్ దశ, దిశ రెండూ మారిపోయాయి. సోషల్ మీడియా స్టార్ కాస్త సెలబ్రిటీ అయిపోయాడు.ప్రస్తుతం మెహబూబ్ కు చాలా అవకాశాలు వస్తున్నాయి. అటు సినిమాలు, ఇటు టీవీ షోలు.. మరోవైపు తన యూట్యూబ్ చానెల్.. చేతినిండ పని ఇప్పుడు.
Mehaboob : కామెడీ స్టార్స్ ప్రోగ్రామ్ లో మెరిసిన మెహబూబ్
అయితే… తాజాగా కామెడీ స్టార్స్ ప్రోగ్రామ్ లో మెహబూబ్ దిల్ సే మెరిశాడు. సూపర్ డూపర్ డ్యాన్స్ చేసి అందరినీ అలరించాడు. తన డ్యాన్స్ నచ్చి.. యాంకర్ ఓంకార్ మెహబూబ్ కు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. జోర్దార్ సుజాత, అషు రెడ్డి, సిరి.. ముగ్గురు అందమైన అమ్మాయిలను చూపించి.. వీళ్లలో ఒకరికి ముద్దు ఇవ్వాలంటే ఎవరికి ఇస్తావు అని అడిగాడు.
అలాగే.. ముగ్గురిలో హగ్ చేసుకోవాలనుకుంటే ఎవరిని హగ్ చేసుకుంటావు.. అంటూ మెహబూబ్ కు సూపర్ ఆఫర్ ఇస్తాడు ఓంకార్ అన్నయ్య.హగ్.. ముద్దు అంటే కొంచెం కష్టమే అని మెహబూబ్ అనగా… కేవలం చెప్పడమే చేయడం లేదు… అనగానే అక్కడంతా నవ్వులు విరబూశాయి. దానికి సంబంధించిన ప్రోమోను మీరు కూడా చూసేయండి.