బిగ్బాస్ ఇంటిలో కంటెస్టెంట్ లకు కొన్ని ఆంక్షలు ఉంటాయి. ముఖ్యంగా తిండి విషయంలో ఇంటి సభ్యులు చాలా పొదుపుగా ఉండాలి. ఇక బిగ్బాస్ కొన్ని స్పెషల్ టాస్క్ లు నిర్వహించి చికెన్, మటన్ వంటివి పంపిస్తుంటాడు లేదా లగ్జరీ బడ్జెట్ లో భాగంగా ఇంటి సభ్యులు మాంసం తో కూడిన ఐటమ్స్ సెలెక్ట్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు.
ఇక నాలుగో సీజన్లో ముఖ్యంగా మటన్ అంటే పడి చచ్చిపోయే వారు చాలా మంది ఉన్నారు. వారిలో మరీ ముఖ్యంగా మెహబూబ్, హారిక, సోహెల్ కు మటన్ అంటే చాలా ఇష్టం. ఈ వారానికి రేషన్ మేనేజర్ గా ఉన్న అవినాష్ మటన్ విషయంలో అజాగ్రత్తగా వ్యవహరించాడు. మటన్ ను అతను డీ ఫ్రిడ్జ్ లో పెట్టకపోవడంతో కేజీ మటన్ పాడైపోయింది. ఇక దీనిపై అందరూ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరీ ముఖ్యంగా మెహబూబ్, సోహెల్ లు నిరుత్సాహ పడ్డారు. ఇదంతా నీ వల్లే జరిగింది అంటూ అవినాష్ ను తీసుకెళ్లి స్విమ్మింగ్ పూల్ లో పడేశారు. ఇక స్విమ్మింగ్ పూల్ లో నుండి బయటికి రానివ్వలేదు. అలాగే అర్థనగ్నంగా ఉంచేశారు. అవినాష్ కు సంబంధించి పెర్ఫ్యూమ్ బాటిల్స్ ను కూడా స్విమ్మింగ్ పూల్ లో పడేస్తామని బెదిరించారు.
మటన్ వచ్చే వరకు ఈ కోటా హుడ్లు మొత్తం మాకే అని బెదిరించారు. ఇక అవినాష్ రాత్రికి మటన్ తెప్పిస్తానని మాట ఇచ్చాడు. అవినాష్ రేషన్ మేనేజర్ గా విఫలం కావడంతో ఆ బాధ్యతను లాస్య కు అప్పగించారు. ఇక ఈ అంశం వచ్చేవారం అవినాష్ నామినేషన్ కు కారణం అయ్యే లాగా కనిపిస్తోంది.