కోహ్లీ 82, పుజారా106ఔట్

బాక్సింగ్ డే టెస్ట్ లో భారత్ బ్యాట్స్ మన్ రాణించారు. రెండో రోజు లంచ్ వరకూ ఒక్క వికట్ కూడా కోల్పోకుండా ఆడిన జట్టు లంచ్ తరువాత స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోయింది. 215/2 ఓవర్ నైట్ స్కోరుతో ఈ రోజు బ్యాటింగ్ ప్రారంభించిన టీమ్ ఇండియా లంచ్ వరకూ వికెట్ కోల్పోకుండా ఆడింది. ఈ క్రమంలో పుజారా సెంచరీ సాధించాడు. కోహ్లీ హాఫ్ సెంచరీ సాధించాడు.

అయితే లంచ్ తరువాత 82 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లీ, 106 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పుజారా ఔటై పెవిలియన్ కు చేరారు. ప్రస్తుతానికి రహానే 18 పరుగులతోనూ, రోహిత్ శర్మ నాలుగు పరుగులతోనూ క్రీజ్ లో ఉన్నారు. ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ లో ఇప్పటి వరకూ భారత్ పటిష్ట స్థిితిలో ఉందని చెప్పాలి. బౌన్సీ పిచ్ పై బ్యాటింగ్ కష్టం అయినప్పటికీ భారత బ్యాట్ మన్ నిలకడగా ఆడారు. సిరీస్ 1-1 తో సమానంగా ఉన్న నేపథ్యంలో మూడో టెస్టులో విజయం ఇరు జట్లకూ కీలకం.

SHARE