NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

YSRCP: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయి. జగన్ బస్సు యాత్రలో కూటమి (టీడీపీ,జనసేన,బీజేపీ)  పార్టీల నుండి వచ్చి చేరుతున్నారు. సీఎం జగన్ సమక్షంలో వారు పార్టీ కండువాలు కప్పుకుంటున్నారు. గత నెల 27న ఇడుపులపాయలో మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభం అయిన నాటి నుండి చేరికల పర్వం కొనసాగుతోంది.

కూటమి పార్టీలో టికెట్లు దక్కని వారు, అసంతృప్తి చెందుతున్న వారు వచ్చి జగన్ సమక్షంలో పార్టీలో చేరి ఎన్నికల సమయంలో తాము మద్దతుగా నిలుస్తామని చెబుతున్నారు. తాజాగా బస్సు యాత్రలో భాగంగా బుధవారం ఎచ్చర్ల నియోజకవర్గం అక్కివలస స్టే పాయింట్ వద్ద పలువురు కీలక నేతలు తమ అనుచరులతో వైసీపీలో చేరారు. టెక్కలి మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి, ఆమె కుమార్తె శిరీష వైసీపీలో చేరారు.

అలానే పార్వతీపురం నియోజకవర్గం నుండి టీడీపీ సీనియర్ నేత, మహిళా కమిషన్ మాజీ సభ్యురాలు కొయ్యాన శ్రీవాణి, పాతపట్నం నియోజకవర్గం హిరమండలం మాజీ జడ్పీటీసీ లోలుగు లక్ష్మణరావు, విజయనగరం జిల్లా బొబ్బలి నియోజకవర్గానికి చెందిన బీజేపీ మాజీ మంత్రి పెద్దింటి జగన్మోహనరావు, ఆయన కుమారుడు పెద్దింటి రామస్వామి నాయుడు, ఎచ్చర్ల నియోజకవర్గం రణస్థలం ఎంపీటీసీ మజ్జి గౌరి, టీడీపీ ఉపాధ్యక్షుడు మజ్జి రమేష్, మాజీ ఎంపీపీ గొర్లి విజయకుమార్, సీనియర్ నేత రామారావు వైసీపీలో చేరారు. వీరికి సీఎం వైఎస్ జగన్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్ధుల విజయానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు.

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

Related posts

శ్రీ ఎం ఆశ్రమంలో శ్రీ గురు మహావతార్ బాబాజీ ఆలయ గ్రాండ్ ఓపెనింగ్ 

Deepak Rajula

YSRCP: తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత .. బాబు సర్కార్ పై జగన్ ఆగ్రహం

sharma somaraju

AP Assembly: ఏపీ శాసనసభ స్పీకర్ గా నేడు బాధ్యతలు చేపట్టనున్న అయ్యన్న .. అనూహ్య నిర్ణయం తీసుకున్న వైసీపీ..!

sharma somaraju

Salar Jung Reforms: Important Points to Remember for TGPSC Group 1 and Group 2 Exams 2024

Deepak Rajula

YS Jagan: ఓటమితో అధైర్యపడవద్దు – క్యాడర్ కు తోడుగా నిలిచి భరోసా ఇవ్వండి: వైసీపీ నేతలకు జగన్ సూచన  

sharma somaraju

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు .. ఇకపై కొత్త చంద్రబాబును చూస్తారంటూ..

sharma somaraju

Chirajeevi – Pawan Kalyan: చిరు ఇంటికి పవన్ .. ‘మెగా’ సంబురం

sharma somaraju

ఏపీ గవర్నర్ కు ఎన్నికైన ఎమ్మెల్యే జాబితాను అందజేసిన సీఈవో .. గెజిట్ నోటిఫికేషన్ విడుదల

sharma somaraju

Modi – Pawan Kalyan: కుటుంబ సమేతంగా మోడీని కలిసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

ప్రధాని మోదీ పరిస్థితిపై కాంగ్రెస్ వ్యంగ్య చిత్రం .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

YS Jagan: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి: వైఎస్ జగన్

sharma somaraju

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N