Bigg Boss 5 Telugu: నాలుగో వారం హౌస్ నుండి ఎలిమినేషన్ కి నామినేట్ అయిన సభ్యులు..!!

Share

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో నాలుగో వారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ వాడివేడిగా జరిగింది. ఎదుటి వారి తప్పులు బయట పెడుతూ.. ఎవరికి వారు తమ ప్రత్యర్థులను నామినేట్ చేశారు. అయితే ఈ వారం.. హౌస్ లో నామినేషన్ ప్రక్రియ.. ఎలా జరిగింది ఓ లుక్కేద్దాం. ఆ మినిట్ చేయాలనుకునే 20 సభ్యులు ఎదుట ఉండే ముఖాల్లోని ఒక భాగాన్ని తీసివేసి… స్విమ్మింగ్ పూల్లో వేయాలని.. బిగ్బాస్ తెలియజేస్తారు. ఈ క్రమంలో ముందుగా వచ్చిన ప్రియా.. తనతో హౌస్లో సరిగ్గా ఉండట్లేదని కలవట్లేదు అని లోబో, మానస్ ని నామినేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత విశ్వ.. యాంకర్ రవి ని అదే రీతిలో నటరాజు మాస్టర్ ని నామినేట్ చేశాడు. ఈ క్రమంలో నటరాజు మాస్టర్ కి అదేరీతిలో విశ్వా కి మధ్య గట్టిగానే అరుపులు కేకలు అన్న తరహాలో గొడవ సాగింది. తర్వాత లోబో… నేను నా లవ్ స్టోరీ చెబుతున్న టైం లో.. నా ప్రేమకథ గురించి ప్రియా సినిమా స్టోరీ లా ఉందని ఇష్టానుసారంగా నోరు జారువు అన్న తరహాలో.. గట్టి గట్టిగా ప్రియపై అరిచాడు.

ఆ మాటతో నా ఖలేజా పగిలిపోయింది. నన్ను తిట్టు, చెప్పు తీసుకుని కొట్టు వింటా.. కానీ అలా మాట్లాడకూడదు అంటూ సీరియస్ అవుతూ ఒక్కసారిగా తన మీదకు అలా దూసుకురావడంతో షాకైన ప్రియ.. నాపై అరిచే హక్కు నీకు లేదని వార్నింగ్‌ ఇచ్చింది. అయినా కానీ చాలా ఫీల్ అయినా లోబో… ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ప్రేమించిన అమ్మాయిని టైంపాస్ చేయలే అమ్మాయికి రెస్పెక్ట్ ఇచ్చాను అని.. చెబుతూ ఉండగా మధ్యలో అడ్డుకున్న ప్రియ అమ్మాయిలకు నువ్వు ఏ విధంగా గౌరవం ఇస్తున్నావో… చూస్తుంటే అర్ధం అవుతుంది అంటూ కౌంటర్ ఇచ్చింది. ఈ క్రమంలో బయట జనాలు వల్ల తాను ఈ స్టేజ్ లో ఉన్నట్టు గతంలో వేసిన డైలాగులు మళ్లీ మరోసారి లోబో.. వేశాడు.

 

లోబో సింపథీ ఏడ్పులు 

ఈ తరుణంలో మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఒకటి మాట్లాడకూడదు అంటూ లోబో కి… మాటకు మాట సమాధానం కౌంటర్ ఇచ్చింది ప్రియా. అంతలోనే లోబో… పైకి చూస్తూ గట్టిగా ఎడిట్ చేయడం తో వెంటనే రవి అతని దగ్గరికి వచ్చి ఓదార్చాడు. ఆ తరువాత సిరి నీ… నామినేట్ చేస్తూ కాజల్ తన లవ్ స్టోరీ చెబుతుంటే మధ్య ఆకలేస్తుంది అని అలా వెళ్ళిపోవడం.. నచ్చలేదని ఎలా అనగలిగవని విమర్శించాడు. శ్రీరామ్‌.. లాస్ట్‌ వీక్‌ తనను నామినేట్‌ చేసిన శ్వేత, యానీ మాస్టర్‌ను నామినేట్‌ చేశాడు. తర్వాత షణ్ముఖ్‌.. మీ వల్ల ఇన్‌ఫ్లూయెన్స్‌ అవుతున్నానంటూ రవిని, ప్రియకు రెస్పెక్ట్‌ ఇవ్వలేదని లోబోను నామినేట్‌ చేశాడు. దీంతో లోబో మరోసారి తను పేదవాడినంటూ ఫ్లూటు వాయించాడు. దీంతో షణ్ముఖ్ జస్వంత్ సీరియస్ అయి అందరూ కింద స్థాయి నుంచి బస్తీ స్థాయి నుంచి పైకి వస్తారు.. అంటూ లోబో కి.. గట్టి కౌంటర్ ఇచ్చాడు.

Bigg Boss Telugu 5 Promo: Telugu BB Housemates Fire on Nataraj Master and Lobo - Sakshi

 

నటరాజ్‌ మాస్టర్‌..విశ్వ గొడవ

తర్వాత కాజల్..నామినేషన్స్‌ను వ్యక్తిగతంగా తీసుకుంటారని నటరాజ్‌ మాస్టర్‌ను, సేఫ్‌ గేమ్‌ ఆడొద్దంటూ సన్నీని నామినేట్‌ చేసింది. ఆ తరువాత సిరి… హౌస్ లో సానుభూతి సంపాదించుకోవడం కోసం లోబో బాగా ట్రై చేస్తున్నాడు అని అతడిని తర్వాత యాని మాస్టర్ ని నామినేషన్ లోకి పంపించడం జరిగింది. ఆ తరువాత వచ్చిన మానస్.. నటరాజ్‌ మాస్టర్‌ను నామినేట్‌ చేయగా ఇద్దరి మధ్య చాలా పెద్ద గొడవ జరిగింది. మాట్లాడుతున్న ఆ సమయంలో మధ్యలో దూరి ఏదో ఒకటి అనేయకండని మానస్‌ హెచ్చరించాడు. అసభ్యకరమైన భాష వాడొద్దని లోబో ఫొటోలో నుంచి ఓ ముక్కను విసిరేశాడు. శ్వేత.. లోబో, రవిని; హమీదా.. లోబో, నటరాజ్‌ మాస్టర్‌ను నామినేట్‌ చేశారు. ఆ తర్వాత నటరాజు మాస్టర్ వంతు రాగా… హౌస్ లో అతిగా నటించకూడదు… నువ్వు చాలా వీక్.. అనిపిస్తోంది అంటూ విశ్వ నీ నామినేట్ చేశారు. ఈ క్రమంలో విశ్వ నన్ను ఎవరు నువ్వు నటిస్తున్నావు అని డిసైడ్ చేయడానికి.. అంటూ నటరాజ్ మాస్టర్ పై సీరియస్ కావటంతో వెంటనే మాస్టర్…మీసం మెలేస్తూ మరింత రెచ్చగొట్టాడు. ‘సింహంతో వేట నాతో ఆట రెండూ ప్రమాదకరమే, అది అడవిలో ఉంటది, ఇది బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉంటుంది’ అని డైలాగులు వల్లె వేయడంతో కాజల్‌ ఫక్కున నవ్వేసింది.

ప్రియా లహరి గొడవ కు సంబంధించి పశ్చాతాప పడ్డాడు

ఆ తర్వాత రవి ని నట్రాజ్ మాస్టర్ నామినేట్ చేశారు. ప్రియాంక సింగ్ వచ్చి .. లోబో తనతో అసభ్యంగా ప్రవర్తించినట్లు.. అతడిని తర్వాత కాజల్ ని నామినేట్ చేసింది. ఆ తర్వాత రవి నటరాజు మాస్టర్ ని.. కాజల్ ని నామినేట్ చేశారు. ఈ క్రమంలో ప్రియా లహరి గొడవ కు సంబంధించి పశ్చాతాప పడ్డాడు అందరిముందు. ఆ తర్వాత యానీ మాస్టర్ తనను నామినేట్ చేసిన శ్రీరామ్, సిరి నీ.. నామినేట్ చేసింది. సన్నీ తననీ పదేపదే సేఫ్ గేమ్ ఆడుతున్నట్లు మాట్లాడిన ప్రియా, కాజల్ ని నామినేట్ చేశాడు. ఇక జెస్సీ… ప్రియాంక, రవి ని నామినేట్ చేయడం జరిగింది. మొత్తంమీద చూసుకుంటే ఈ నాలుగో వారం ఇంటి నుండి ఏమి నిమిషానికి నామినేట్ అయిన సభ్యులు…నటరాజ్‌, లోబో, రవి, ప్రియ, కాజల్‌, సిరి, సన్నీ, యానీ మాస్టర్‌.


Share

Related posts

Nara Lokesh: తిరుపతిలో సంచలన వ్యాఖ్యలు చేసిన లోకేష్ ..జగన్ కి సవాల్..!!

somaraju sharma

టిడిపి పార్టీ లో హాట్ టాపిక్ అయిన లోకేష్, ఎంత పెద్ద మార్పు..??

sekhar

Krishnapatnam Aanandayya: ప్రాణాపాయ రోగులను పంపిద్దాం.. ఆనందయ్యకి ఈ పరీక్ష పెడదాం..!!

Srinivas Manem