బాధిత మహిళ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన సభ్యురాలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం.. సాటి మహిళను కించపరచడమే అని మహిళా సంఘాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఆమె చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. అసలే అత్యాచారం చేసిన వాళ్లు దర్జాగా తిరిగే దేశం మనది.. ఒక్కడికైనా సకాలంలో సరైన శిక్షలు పడితే రెండో వాడు ఆ పని చేయడానికి జంకుతాడు.. కానీ అలాంటివి ఏవీ లేకపోగా తప్పంతా మహిళదే అని ఓ మహిళ అదీ జాతీయ మహిళా కమిషన్ హోదాలో ఉన్న మహిళ ఇలా మాట్లాడడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ కేసు విషయానికి వస్తే …
ఉత్తరప్రదేశ్‌లో 50 ఏళ్ల అంగన్వాడీ కార్యకర్త సాయింత్రం సమయంలో దేవాలయానికి వెళ్లింది. ఆ సమయంలో అక్కడ ఉన్న గుడిలోని పూజారితో పాటు, మరో అయిదుగురు కామాంధులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమె పక్కటెముకలు విరిచారు.. రెండు కాళ్లు విరగ్గొట్టారు. అత్యంత హేయంగా ఆమె ప్రైవేట్ పార్ట్స్‌ని ఛిద్రం చేశారు. ఊపిరితిత్తుల్లో ఇనుప ఊచలతో దారుణంగా గాయపరిచిన ఘటన మరో నిర్భయను తలపించింది. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన దుర్మార్గులు.. ఆలయ పూజారి సహా మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఈ క్రమంలో బాధిత మహిళ ఇంటికి వచ్చి పరామర్శించిన అనంతరం చంద్రముఖి ఈ వ్యాఖ్యలు చేయడం వివాదానికి దారి తీసింది. అయినా గుడికి సాయంత్రం పూట కాకుండా అర్ధరాత్రి వెళతారా అని మహిళా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.ఇటువంటి వారు జాతీయ ఇటువంటి వారు జాతీయ మహిళా సభ్యురాలిగా ఉండడం ఆ పదవికే సిగ్గు చేటని ఆమెను వెంటనే తొలగించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.
అప్పుడు నిర్భయ కేసులో కూడా ఇలాగే!!
కాగా, ఇదివరకు కూడా ఇలాంటి కొన్ని సందర్భాల్లో అత్యున్నత స్థానంలో ఉన్న మహిళలు ఇలానే వ్యాఖ్యానించారు. దేశ రాజధాని నిర్భయ ఉదంతాన్నే తీసుకుంటే.. అప్పుడు కూడా బాధిత మహిళ రేపిస్టులను అన్నయ్యా అని బతిమాలుకుంటే ఆమెను వదిలేసేవారు కదా అని వ్యాఖ్యానించడం విశేషం. సినిమాల్లో స్కిప్ట్ రాసుకుని డైలాగులు చెప్పినట్లుగా అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో తనని తాను కాపాడుకునేందుకు ఆ విధంగా మాట్లాడమని చెప్పడం వాళ్ల ఉద్దేశం కాబోలు. అంతేకాని రేపిస్టుది ఎంత మాత్రం తప్పు లేదు అని వాళ్ల అంతరంగ భావన. వాళ్లు అలా చెలరేగి పోవడం వారి నైజం.. వారి నుంచి మహిళలే దూరంగా పారిపోవాలనేది అత్యున్నత హోదాలో ఉన్న మహిళల అంతరంగిక అభిప్రాయంగా కన్పిస్తోంది. ఏదేమైనా మహిళా రక్షకులుగా వుండాల్సినవారు బాధితుల్నే తప్పుబట్టే రీతిలో ఇలాంటి వ్యాఖ్యలు చేయటం అందరినీ భాధిస్తోంది!
Charan Hrithik Roshan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) నటించిన భారీ…
Thaman: ఒకప్పుడు టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad) సంగీతం హైలెట్ గా నిలిచింది. డీఎస్పీ హవా అప్పట్లో మామూలుగా…
Uday Kiran: హీరో ఉదయ్ కిరణ్(Uday Kiran) అందరికీ సుపరిచితుడే. "చిత్రం"(Chitram) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్…
Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఓ మలయాళ చిత్రంతో సినీ కెరీర్‌ను…
Pavitra Lokesh Naresh: ప్రస్తుతం ఎలక్ట్రానిక్ అదే విధంగా సోషల్ మీడియాలో నరేష్(Naresh), పవిత్ర లోకేష్ ల వ్యవహారం పెను…
Gopichand-NTR: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ రెండు రోజుల క్రితమే `పక్కా కమర్షియల్`తో ప్రేక్షకులను పలకరించాడు. ప్రముఖ దర్శకుడు మారుతి…