న్యూస్ హెల్త్

ఆడవారిని ఆకర్షించాలి అంటే మగవాళ్ల లో ఈ లక్షణాలు ఉండి తీరవలిసిందే!!

Share

స్త్రీలను అందం అనే దృష్టితోనే మ‌గాడు ఎక్కువ‌గా చూస్తాడు. అంద‌మే స్త్రీకి గొప్పఆభరణం అన్న‌ట్టుగా చూసే పురుషులే ఏక్కువ‌, ఆ త‌ర్వాతే వ్య‌క్తిత్వం గురించి ప‌ఆలోచించడం మొదలవుతుంది.ఆడవారిని ఆక‌ట్టుకోవ‌డానికి పురుషులకు అందం తో పాటు మ‌రిన్ని గుణగ‌ణాల‌ను కూడా క‌లిగి ఉండాల్సి ఉంటుంది .  స్త్రీ ప్ర‌త్యేకం గా ప‌రిశీలించే కొన్ని విష‌యాలు మగాళ్ళల్లో ఉంటాయ‌ట‌. అవి స్త్రీని ఆక‌ట్టుకోవ‌డం లో అధికంగా ప్ర‌భావితం చేస్తాయ‌ని ప‌రిశోధ‌కులు తెలియచేస్తున్నారు అవేంటో తెలుసుకుందాం.

ఆత్మా విశ్వాసం అనేది ఎవ‌రికైనా అందాన్ని ఇస్తుంది.అలాగే అతి విశ్వాసం కూడా అందాన్ని పాడుచేస్తుంది. కాబట్టి ఆత్మ‌విశ్వాసం తో న‌డుచుకునే వాళ్లు ఆడవారిని బాగా ఆక‌ట్టుకోగ‌ల‌రని నిపుణులు చెబుతున్నారు., న‌డ‌వ‌డిక విష‌యంలో అయినా ప‌ని విష‌యం లో అయినాఆత్మ‌విశ్వాసం ఉట్టిపడేలా  ఉండాలని సూచిస్తున్నారు.

గిటారో, పియానో వాయించ‌గ‌ల‌గడం వంటి  హాబీ  కూడాఆడ‌వాళ్ల‌ను ఆకర్షించడానికి  మ‌గాడికి అద‌న‌పు అర్హ‌తే అవుతుంది అంటున్నారు నిపుణులు. పురుషుడి నుంచి వెలువ‌డే సువాస‌న‌లు స్త్రీని విపరీతం గా ఆక‌ట్టుకుంటాయట . ఈ విష‌యంలో పెర్ఫ్యూమ్ కంపెనీల వాళ్ల యాడ్స్ ను గ‌మ‌నించే ఉంటారు. మ‌రీ అంతలా కాకపోయినా..మగవారి శరీరం నుండి వచ్చే  సువాస‌న‌కు ఆడ‌వాళ్ల‌ను ఆకర్షించే  శ‌క్తి ఉంటుంద‌ట‌.

వంట అనేది ఆడ‌వాళ్ల జన్మ హక్కు అని బ‌లంగానరనరాలలో నాటుకు పోయిన స‌మాజం మ‌న‌ది. అయితే వంట వ‌చ్చిన పురుషుడు స్త్రీలను  బాగా ఆక‌ట్టుకుంటాడ‌ట‌. అడ‌పాద‌డ‌పా అయినా గ‌రిట తిప్ప‌డం  నేర్చుకోవడం అనేది చాల ప్లస్ అవుతుంది.

ష్యాష‌న‌బుల్ గా దుస్తులు వేసుకోవ‌డం గురించి ఏ మాత్రం పురుషులు ముందు ఉండాలి. ఆఫీసుకు అయినా, ఇంటి లో అయినా సంద‌ర్భాల‌కు త‌గ్గ‌ట్టుగా సెన్సాఫ్ ఫ్యాష‌న్ తో క‌నిపించ‌డం వలన కూడా   స్త్రీని ఆకర్షించవచ్చు .మరి ఇన్ని విషయాలు తెలుసుకున్నాక ఇంకా ఆలస్యం ఎందుకు?పైన చెప్పిన వాటిలో మీలో ఏవైనా లేవని అనిపిస్తే వాటిని డెవలప్ చేసుకోండి.


Share

Related posts

చంద్రబాబు గురించి అసెంబ్లీలో సీఎం జగన్ ఏమన్నారంటే…

somaraju sharma

విమర్శలు మాని సలహాలివ్వండి:మాజీ సిఈసి

sarath

Kajal Aggarwal: కాజల్ ఎంచుకున్న పాత్రను చూసి అందరు ఆశ్చర్య పోతున్నారు!! అసలు ఆమె ఎందుకలా చేస్తుంది?

Naina
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar