Marriage: అబ్బాయిలు… పొరపాటున కూడా ఆ ఏరియా అమ్మాయిని పెళ్లి చేసుకోకండి …!

Share

Marriage: అరుకులోయ ఎన్నో అందాలకు పెట్టింది పేరు. అనేక మంది సేద తీరడం కోసం అరుకు లోయకు వెళ్తుంటారు. కానీ ఆంద్రప్రదేశ్ లోని ఏజెన్సీ ప్రాంతమైన అరకు లోయలోని ఓ గ్రామం చిగుటాకులా వణుకుతోంది. అదే పెదబయలు మండలంలోని పాత రూడకోట గ్రామం. ఆ గ్రామానికి ఆనుకుని సరిహద్దునే ఎన్నో గ్రామాలు ఉన్నా కానీ కేవలం ఆ గ్రామానికి చెందిన చిన్న పిల్లలు మాత్రమే చనిపోతున్నారు.

Marriage: పెళ్లి ముహూర్తం శుక్రవారం వస్తే .. ఆడపిల్లను అత్తారింటికి ఈ విధం గా పంపండి !!
ముక్కు పచ్చలారని చిన్నారులు..

3,4,5 నెలలు కూడా నిండని ముక్కుపచ్చలారని చిన్నారులు వింత వ్యాధితో మరణిస్తున్నారు. ఇలా ఎందుకు జరుగుతుందని ఆ పల్లె వాసులకు ఎంతకూ అంతు చిక్కడం లేదు. ఆదుకోవాల్సిన డాక్టర్లు హేళన చేస్తూ మాట్లాడుతున్నారని వారు వాపోతున్నారు. ఇంత జరుగుతున్నా రెండేళ్ల నుంచి అక్కడ దాదాపు 14 మంది చిన్నారులు మరణించినా కానీ ఒక్క వైద్య క్యాంపు కూడా నిర్వహించకపోవడం దారుణం. గిరిజనుల బాగోగులను చూసుకోవాల్సిన ఐటీడీఏ కూడా ఏం పట్టనట్టు వ్యవహరిస్తోందని వారు ఆరోపిస్తున్నారు. ఎన్ని సార్లు ఐటీడీఏ పీవోకు ఫిర్యాదు చేసినా కూడా ఎటువంటి స్పందన లేదని లబోదిబోమంటున్నారు.

Besan Flour: శనగపిండి కల్తీ చేశారో లేదో ఇలా చెక్ చేయండి..!? 
జంకుతున్న గ్రామస్తులు…

పాత రూడకోట గ్రామానికి చెందిన వారు పెళ్లి చేసుకునేందుకు జంకుతున్నారు. ఒక వేళ పెళ్లి చేసుకున్నా.. కానీ పిల్లల్ని కనాలంటే మాత్రం ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు. కారణం వింత వ్యాధి. అసలు ఈ వ్యాధి ఎందుకు వస్తుందో? ఎందుకు పిల్లలు అకస్మాత్తుగా చనిపోతున్నారో? ఏమీ తెలియక ఆ అమాయక గిరిజనులు సతమతమవుతున్నారు. పట్టించుకోవాల్సిన వారు పట్టించుకోకపోవడంతో ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితిలోకి జారిపోయారు. పుట్టిన పిల్లలకు బల్ల జారడం అనే చిన్న వ్యాధి వలె వచ్చి ప్రాణాలను కబలించేస్తోందని వారు వాపోతున్నారు. పొత్తి కడుపులో నొప్పితో ఆస్పత్రికి చేర్చే లోపే ప్రాణాలను కోల్పోతున్నారని అంటున్నారు. ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం దారుణమని గ్రామస్తులు తమ గోడు వెళ్లబోసుకున్నారు.


Share

Related posts

మళ్లీ హోస్ట్ గా చేయనున్న ఎన్టీఆర్… సూపర్ అప్డేట్

arun kanna

‘రైతు కన్నీరు రాష్ట్రానికి క్షేమం కాదు’

somaraju sharma

CBI: సుప్రీం కీలక వ్యాఖ్యలతో సీబీఐలో కదలిక..! న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యల కేసులో మరో ఇద్దరు అరెస్టు..!!

somaraju sharma