కంపెనీ తేనెలన్నీ ఎక్కువగా ప్రాసెస్ చేసే అమ్ముతుంటాయి. ఇలా అధికంగా ప్రాసెస్ చేయబడ్డ తేనెల వలన ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. మార్కెట్లో దొరికే తేనె కంటే, తేనె పట్టు నుంచి సేకరించిన తేనెను కొనుక్కోవడమేమంచిదని సూచిస్తున్నారు పరిశోధకులు. తేనెపట్టు నుంచీ తీసిన తేనెకు మాత్రమే అసలైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయ అంటున్నారు నిపుణులు.
గ్రామాలలో నివసించే ప్రజలు మాత్రమే తేనెతో ఎన్నో ప్రయోజనాలను పొందుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన తేనె దొరికితే.. నగరాల్లో మాత్రం కల్తీ తేనె అందుబాటులో ఉంది. అయితే స్వచ్ఛమైన తేనె, కల్తీ తేనెను ఎలా గుర్తించాలోతెలుసుకుందాం. ఓ టేబుల్ స్పూన్ తేనె తీసుకుని ఓ గ్లాస్ నీటిలో కలపండి. ఆ తర్వాత కాస్త వెనెగర్ కూడా వెయ్యండి. నురుగు వస్తే అది కల్తీ తేనె అని అర్ధం.
గ్లాస్ తో మంచి నీటిని తీసుకుని టేబుల్ స్పూన్ తేనె వేయండి.స్పూన్ తో కలపకుండా గ్లాస్ ను అటూ ఇటూ తిప్పుతూ కలపండి . తేనె నీటి లో కలిసిపోతే అది కల్తీ గా గుర్తించండి.అలాగే అడుగుభాగాన ఉండిపోతే అది స్వచ్ఛమైన తేనె గా గుర్తించండి. కాస్త తేనె తీసుకుని బ్లాటింగ్ పేపర్ కు రాయాలి. పేపర్ తడిసి పోతే అది కల్తీ తేనె.
కొంచెం తేనె తీసుకుని చేతి బొటన వేలి పై వేయండి. చేతికి అతుక్కుపోయి అలాగే ఉండిపోతే అది నాణ్యమైన తేనె అని అర్ధం. అలాకాకుండా వేలి నిండా పరచుకుంటూ , జారిపోతు ఉన్నట్టయితే అది కల్తీది. ఒక అగ్గిపుల్లను తీసుకొని తేనె లో ముంచి,ఆ పుల్లను అగ్గిపెట్టెపై ఉన్న గంధకానికి గీస్తే మండాలి. అలా మండలేదంటే అది కల్తీ తేనె. ఎందుకంటే స్వచ్ఛమైన తేనెకు మండే గుణం ఉంటుంది. తేనెలో పత్తి ఒత్తిని ముంచి వెలిగిస్తే వెలుగుతుంది కూడా .