న్యూస్ సినిమా

మిడిల్ రేంజ్ హీరోలే కానీ 3 హిట్ సినిమాలతో అదరగొట్టారు..!

Share

ప్రస్తుతం టాలీవుడ్‌కి మంచి టైమ్‌ నడుస్తుంది. కేవలం పది రోజుల గ్యాప్‌లోనే మూడు సినిమాలు మంచి హిట్ సాధించాయి. థియేటర్లు జనాలతో కళకళలాడుతున్నాయి. ఇండస్ట్రీ సమస్యల గురించి నిర్మాతలు చర్చించుకునే సమయంలో రిలీజైన మూడు సినిమాలు హిట్ అవ్వడంతో ఆనందపడాల్సిన విషయం. కానీ ఇక్కడ ప్రత్యేకంగా చర్చించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి.

మూడు సినిమాలతో హిట్స్

బింబిసార సినిమా చేసే సమయానికి కళ్యాణ్ రామ్ కెరీర్ గ్రాఫ్ ఏం బాలేదు. జూ.ఎన్టీఆర్ అభిమానుల సాయంతో ఏమైనా మద్దతు ఉంటే తప్ప తనకంటూ గొప్పగా ఓపెనింగ్స్ రాని పరిస్థితి కళ్యాణ్ రామ్ ది. అందుకే బింబిసార సినిమా కోసం ఎంత బడ్జెట్ పెట్టినా సరే, దానికి తగ్గట్టు డిమాండ్ చేయకుండా రీజనింగ్ రేట్లకే టికెట్స్ ఇచ్చేశారు. కానీ నిర్మాతలకు మాత్రం మంచి లాభాలు దక్కాయి. ఎందుకంటే సినిమా కథ చాలా కొత్తగా ఆకట్టుకునేలా ఉంది. అందుకే హీరో ఒక టాప్ స్టార్ కాకపోయినా సినిమా సూపర్ హిట్ అయ్యింది.

మహానటి సినిమాలో కీలక పాత్ర వహించిన దుల్కర్ సల్మాన్ ఇటీవల రిలీజ్ అయిన సీతా రామం సినిమాలో హీరోగా నటించాడు. తెలుగులో కనులు కనులు దోచాయంటే సినిమా దుల్కర్ సల్మాన్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. కానీ నలభై, యాభై కోట్ల రేంజ్ మాత్రం చేరుకోలేకపోయింది. అయితే వైజయంతి సంస్థ కంటెంట్ ని నమ్మి పెట్టిన ఖర్చు, గ్రాండీయర్ ని చూసి డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి ఏది వృధా కాలేదు. రెండో వారంలో సీతా రామం ఈజీగా బ్రేక్ ఇవెన్ దాటింది.

ఇక నిఖిల్ సిద్ధార్థ తెరమీద కనపడక రెండు సంవత్సరాలు దాటింది. ఇటీవల రిలీజ్ అయిన కార్తికేయ 2 సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అర్జున్ సురవరం తర్వాత కొన్ని కారణాల వల్ల కొన్ని ప్రాజెక్టులు ఆలస్యం అయ్యాయి. కార్తికేయ 2 సినిమా మీద నమ్మకంతో 18 పేజెస్, స్పైలను ఆలస్యం చేసుకుంటూ వచ్చారు. ఆ నమ్మకం ఇప్పుడు వారిని గెలిపించింది.

మిడిల్ రేంజ్ హీరోలే

ఈ ముగ్గురు హీరోల్లో ఏ ఒక్కరికి ప్రస్తుతం మార్కెట్లో రూ.15 కోట్ల కంటే ఎక్కువ రేంజ్ లేదు. అయినా సరే మంచి విజయం సాధించారు. ప్రస్తుతం వారి గురించి నేషనల్ మీడియాలో కూడా మాట్లాడుకునేంతలా! అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ప్రతిసారి స్టార్ స్టేటస్ పవర్ పనిచేయదు. కొనేవారికి సరైన టికెట్ ధర ఇస్తే అందరికి మంచి లాభాలు వస్తాయి. ఆచార్య, థాంక్యూ సినిమాలకు మొదటి రోజే థియేటర్లు ఖాళీగా ఉన్నాయి. దాన్నిబట్టి అభిమానుల అభిరుచులకు తగ్గట్టుగా సినిమా తీస్తే హీరో రేంజ్ గురించి పట్టించుకోరు అనేది అర్థమవుతుంది.


Share

Related posts

Biggest flop movie: 2021లో ఈ దేశంలోనే అతి పెద్ద ఫ్లాప్ చిత్రం ఇదే..!

kavya N

Mahesh Babu: మ‌హేష్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్‌.. అదే నిజ‌మైతే నిరాశ త‌ప్ప‌దు!

kavya N

ఇక లాంఛ‌న‌మే

Siva Prasad