Mahesh : మహేష్ తో సినిమాతో చేయాలని టాలీవుడ్ సహా మిగతా సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్స్ అందరూ తెగ ఆరాటపడుతుంటారు. రీసెంట్ గా బాలీవుడ్ బ్యూటీ .. క్రేజీ హీరోయిన్ పరిణీతి చోప్రా కూడా టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఒక్క సినిమా చేయాలని ఉందన్న కోరిక ని బయట పెట్టింది. పరిణీతి బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్. వరసగా మూడు సినిమాలతో రాబోతోంది. ఇంత క్రేజ్ ఉన్న హీరోయిన్ కూడా మహేష్ బాబు తో తెలుగు సినిమా చేయాలనుకోవడం అంటే ఆయన క్రేజ్ హీరోయిన్స్ లో ఎంతగా ఉందో అర్థమవుతోంది.
ఇక మహేష్ బాబు తో నటించిన హీరోయిన్స్ అందరూ ఆయన అందగాడు… సాఫ్ట్ నేచర్.. వగైరా వగైరా అంటూ చెప్పుకొస్తుంటారు. ఇక కొంతమంది యంగ్ హీరోయిన్స్ అయితే మహేష్ బాబు సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోయిన్స్ గా లాంఛ్ అయ్యే ఛాన్స్ వస్తే బావుంటుందని కోరుకుంటున్నారు. ఒక్కసారి మహేష్ బాబు తో నటిస్తే చాలు అనుకున్న హీరోయిన్ ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ నటించాలని ఆరాటపడుతుంటారు. ఇక అభిమానులు కూడా మహేష్ బాబు తో తమ స్టార్ హీరోయిన్ స్క్రీన్ చేర్ చేసుకుంటే చూడాలని ఉందన్న ఆశని చాలా సందర్భాలలో చెప్పుకొచ్చారు.
Mahesh : మహేష్ బాబు – తమన్నా కలిసి కార్పోరేట్ యాడ్స్ లో కూడా..!
అలాంటి రిపీటెడ్ కాంబినేషన్ సూపర్ స్టార్ మహేష్ బాబు – మిల్కీ బ్యూటీ తమన్నా లది. గతంలో ఆగడు అన్న సినిమా చేశారు. మళ్ళీ చాలాకాలానికి మహేష్ బాబు తో సరిలేరు నీకెవ్వరు సినిమాలో స్పెషల్ సాంగ్ లో స్టెప్పులేసింది. తాజాగా మరోసారి తమన్నా మహేష్ బాబు తో కలిసి ఒక యాడ్ ఫిల్మ్ చేస్తోంది. ప్రస్తుతం ఈ యాడ్ ఫిల్మ్ షూటింగ్ జరుగుతోందట. త్వరలో ఈ యాడ్ ప్రసారం కాబోతోందని తెలుస్తోంది. మొత్తానికి సినిమాలతో పాటు మహేష్ బాబు – తమన్నా కలిసి కార్పోరేట్ యాడ్స్ లో కూడా నటిస్తుండటం ఫ్యాన్స్ కి సర్ప్రైజింగ్ గా అనిపిస్తోంది.