ఎంఐఎం పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హనుమాన్ శోభా యాత్రలో గాడ్సే ఫోటో ప్రదర్శించడం ఏమిటని మండిపడ్డారు. మహాత్మా గాంధీని కాల్చి చంపిన నాథురామ్ గాడ్సే దేశంలో తొలి టెర్రరిస్టు అని, ఆయన ఫోటోలు ప్రదర్శిస్తుంటే పోలీసులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు అసదుద్దీన్ ఓవైసీ. తాము లాడెన్, హజరీ ఫోటోలు ప్రదర్శిస్తే ఊరుకుంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

రీసెంట్ గా హైదరాబాద్ లో శ్రీరామనవమి రోజున గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ నిర్వహించిన శోభాయాత్ర లో మహాత్మా గాంధీని హత్య చేసిన నాథూరామ్ గాడ్సే ఫోటో దర్శనం ఇవ్వడం తీవ్ర కలకలాన్ని రేపింది. ఈ నేపధ్యంలోనే అసదుద్దీన్ స్పందిస్తూ హనుమాన్ శోభాయాత్రలో గాడ్సే ఫోటోలు ప్రదర్శించడం ఏమిటని ప్రశ్నించారు.
ఉమ్మడి పోరుకు వైఎస్ షర్మిల మరో అడుగు..రేపు రౌండ్ టేబుల్ సమావేశం
జగన్ పార్టీని రెండుగా విడగొట్టేందుకు బ్యాక్ గ్రౌండ్ కుట్ర సిద్ధం!