KTR: ట్రాఫిక్ అధికారులను పిలిపించి సత్కరించిన మంత్రి కేటిఆర్..! కారణం తెలిస్తే షహబాష్ అనాల్సిందే..!!

Share

KTR: సాధారణంగా కొందరు గ్రామ, పట్టణ స్థాయి ప్రజా ప్రతినిధులు అధికారులపై జులం ప్రదర్శిస్తుంటారు. తాము సామాన్య ప్రజల కంటే అతీతులమనీ, తమకు చట్టాలు వర్తించవనీ పోలీసులపై తరచు రుబాబు చేయడం చూస్తుంటాము. రాంగ్ రూట్ లో వాహనాన్ని  నిలుపుదల చేసినా, టోల్ ప్లాజాల వద్ద తమ టోల్ రుసుము చెల్లించాలని డిమాండ్ చేసినా తాను ఎవరో తెలుసా అంటూ రుబాబు చేస్తుంటారు. కానీ తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారక రామారావు (కేటిఆర్) చేసిన పని చూస్తే అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. ఇటీవల మంత్రికే చేదు అనుభవం ఎదురైంది. రెండు రోజుల క్రితం రాంగ్ రూట్ లో వెళ్లిన మంత్రి కేటిఆర్ కారుకు ట్రాఫిక్ అధికారులు జరిమానా (చలనా) విధించారు. ఈ విషయం తెలిసిన ఆయన తాను మంత్రిని, తన కారుకే చలానా వేయడం ఏమిటి, ఆ ట్రాఫిక్ అధికారులకు మెమో జారీ చేయండి అంటూ ఉన్నతాధికారులను ఆదేశించకుండా ఎవరైతే తన కారుకు జరిమానా విధించారో తెలుసుకుని వారిని తన కార్యాలయానికి పిలిపించుకుని వారిని సత్కరించి అభినందించారు.

Minister KTR appreciates traffic si and constable who issued challan to his car
Minister KTR appreciates traffic si and constable who issued challan to his car

విషయం ఏమిటంటే…

ఇటీవల బాపు ఘాట్ లో నిర్వహించిన గాంధీ జయంతి సందర్భంగా అనుకోని పరిస్థితిలో మంత్రి కేటిఆర్ కారు రాంగ్ రూట్ లో వెళ్లింది. ఆ సమయంలో టాఫిక్ విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ ఐలయ్య, కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు ట్రాఫిక్ నిబంధనలు అందరికీ సమానమే అన్నట్లు మంత్రి కేటిఆర్ కారుకు జరిమానా విధించారు. ఇది జరిగి రెండు రోజులు దాటి పోగా నేడు మంత్రి కేటిఆర్ సదరు ట్రాఫిక్ అధికారులను తన కార్యాలయానికి పిలిపించారు. మంత్రి పేషీ నుండి ట్రాఫిక్ అధికారులకు కబురు రావడంతో వీరు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఏకంగా మంత్రి గారి కారుకే జరిమానా వేసినందుకు మందలిస్తారేమో అని భయపడ్డారు. అయితే అక్కడ వారు భయపడినట్లు ఏమీ జరగలేదు.

KTR: కార్యకర్తలు, నేతలకు సందేశం ఇచ్చేందుకే

మంత్రి కేటిఆర్ తన కార్యాలయంలో ట్రాఫిక్ ఎస్ఐ ఐలయ్య, కానిస్టేబుల్ వెంకటేశ్వర్లును దుశ్సాలువాలతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి కేటిఆర్ మాట్లాడుతూ నిజాయితీగా నిబంధనల ప్రకారం పని చేసే ఐలయ్య లాంటి అధికారులకు తామెప్పుడూ అండగా ఉంటామని పేర్కొన్నారు. సామాన్య ప్రజలు అయినా అధికారంలో ఉన్న ప్రజా ప్రతినిధి అయినా నిబంధనలు అందరికీ ఒక్కటేనని అన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడంలో తాను ఎప్పుడూ ముందు ఉంటాననీ కానీ చలానా విధించిన రోజు సైతం కారు (వాహనం)లో తాను లేనని చెప్పారు. ఈ సందర్భంగా వారిని సత్కరించిన మంత్రి కేటిఆర్.. నిబంధనల ప్రకారం తన వాహనానికి చలానా విధించిన ఎస్ఐ ఐలయ్య, కానిస్టేబుల్ వెంకటేశ్వర్లులను శాలువాతో సత్కరించి అబినందనలు తెలియజేస్తూ.. విధి నిర్వహణలో నిజాయితీగా పని చేసే అధికారులకు ఎప్పుడూ తాము అండగా ఉంటామని ఈ సందర్భంగా కేటిఆర్ తెలిపారు. ఈ సందర్భంగా చలనా చెల్లించిన మంత్రి కేటిఆర్.. ట్రాఫిక్ నిబంధనల విషయంలో తమ పార్టీ నాయకులు, కార్యకర్తలకు సరైన సందేశం అందించేందుకే ఈ రోజు ట్రాఫిక్ సిబ్బందిని అభినందించినట్లు తెలిపారు. ఈ విషయాన్ని పార్టీ శ్రేణులు గుర్తించాలన్నారు. మంత్రి కేటిఆర్ చేసిన ఈ పని సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు ఆయనను అభినందిస్తున్నారు.


Share

Related posts

జగన్ కి గిఫ్ట్ ఇస్తాం… టీడీపీ ఎమ్మెల్యే..!!

Special Bureau

తెలుగు రాష్ట్రాల్లో ప్రదాన ఆలయాల్లో ప్రత్యేక పూజలు రద్దు

Siva Prasad

‘ప్రజలు తిరగబడతారు,జాగ్రత్త!’

somaraju sharma