NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Breaking: మంత్రి మల్లారెడ్డి కుమారుడికి అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు

Breaking: తెలంగాణ మంత్రి మల్లారెడ్డి, అతని కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల నివాసాల్లో ఐటీ సోదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మంగళవారం ఉదయం నుండి ప్రారంభమైన ఐటీ అధికారుల తనిఖీలు రాత్రి కూడా కొనసాగాయి. అయితే ఐటీ అధికారుల సోదాలు చేస్తున్న సమయంలో మల్లారెడ్డి పెద్ద కుమారుడు మహేందర్ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురైయ్యారు. ఛాతి లో నొప్పి రావడంతో ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే సూరారంలోని ఆసుపత్రికి తరలించారు.

Malla Reddy

 

తన కుమారుడు మహేందర్ రెడ్డి అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న మంత్రి మల్లారెడ్డి ఆసుపత్రికి వెళ్లేందుకు బయలుదేరారు. అయితే అక్కడే సోదాలు జరుపుతున్న ఐటీ అధికారులు బయటకు వెళ్లడానికి వీలులేదని నిలువరించారు. అధికారులను నెట్టివేసి మంత్రి తన ఇంటి నుండి బయటకు వచ్చేసి ఆసుపత్రికి వెళ్లారు. అనంతరం ఆయన ఐటీ తనిఖీలపై స్పందించారు. రాజకీయ కుట్రతోనే దాడులకు పాల్పడుతున్నారని మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. తన పెద్ద కుమారుడిని ఇబ్బంది పెట్టడం వల్లనే ఛాతి నొప్పి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల తీరుపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మేము ఏమైనా దొంగ వ్యాపారం చేస్తున్నామా అని ప్రశ్నించారు. తాను కష్టపడి సంపాదించాననీ, సమాజంలో నిజాయితీ మెలిగామని అన్నారు. ఎన్నో సంవత్సరాలు కష్టపడితే ఈ స్థాయికి ఎదిగామన్నారు. బీజేపీ దాడులకు భయపడేది లేదని మంత్రి మల్లారెడ్డి అన్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju

Rashmika Mandanna: త‌న కెరీర్ లో ర‌ష్మిక మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట

sharma somaraju

Love Guru: సినీ ప్రియుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఈ మూవీ చూస్తే మలేషియా, కశ్మీర్, ఊటికి ఫ్రీగా ఫ్యామిలీ ట్రిప్‌!

kavya N

Longest Run Movies: థియేట‌ర్స్ లో అత్య‌ధిక రోజులు ఆడిన టాప్ 5 తెలుగు సినిమాలు ఇవే..!!

kavya N

Janhvi Kapoor: ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌తో పాటు మ‌రో స్టార్ హీరోను మ‌డ‌తెట్టేసిన జాన్వీ క‌పూర్‌.. ఇంత స్పీడ్‌గా ఉందేంట్రా బాబు..?!

kavya N