NewsOrbit
న్యూస్

జగన్ ప్రమాణస్వీకారం అప్పుడు కన్న కల.. ఇప్పుడు తీర్చేందుకు కంకణం కట్టుకున్న మేకపాటి!

ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం అనంతరం జగన్ కన్న కలల్లో బలమైనవి ఒకటి సంక్షేమ పథకాలు ఎట్టిపరిస్థితుల్లోనూ అర్హులందరికీ అందాలని.. రాష్ట్రానికి పరిశ్రమలు తేవాలని, పారిశ్రామికంగా రాష్ట్రం అభివృద్ధి చెందాలని! మొదటి కలకు కరోనా రూపంలో ఎన్నో సమస్యలు వచ్చి జగన్ ని పరీక్షించినా… ఆ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గని జగన్ చేసి చూపించారు. ఈ క్రమంలో రెండో కల… పరిశ్రమలు తెచ్చే విషయంలో మేకపాటి సైలంట్ గా చేసుకుంటూపోతున్నారు!!

పబ్లిసిటీ వద్దు.. పనిచేసుకుపోవడమే ముద్దు అన్నచందంగా పరిపాలన సాగిస్తున్న జగన్ సర్కార్ విషయంలో… తాజాగా మేకపాటి గౌతం రెడ్డి చేసిన పనులు మరో ఉదాహరణగా మారాయి!! ఈ నేప‌థ్యంలోనే జపాన్‌కు చెందిన అనేకపరిశ్రమలతో ఏపీ ప‌రిశ్రమ‌ల శాఖామంత్రి మేక‌పాటి గౌతంరెడ్డి చర్చలు జరిపారు. తద్వారా జపాన్ కు చెందిన వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీస్.. ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో సహకరించేందుకు సానుకూలంగా స్పందించాయి. ఫలితంగా రాష్ట్రంలో పోర్టుల నిర్మాణం, ఓడరేవుల ద్వారా రవాణా, పోర్టు ఆధారిత క్లస్టర్‌ డెవలప్ ‌మెంట్, ఇండస్ట్రియల్‌ క్లస్టర్ల అభివృద్ధిలో జపాన్‌ సంస్థల భాగస్వామ్యం పెరగబోతోంది. ఫలితంగా రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి ప‌నులు యుద్ధ ప్రాతిప‌దిక‌న ముందుకు సాగ‌నున్నాయి.

ఫలితంగా జగన్ భావిస్తున్నట్లుగా ముందుగా ప్రకటించిన రాష్ట్రవ్యాప్తంగా ఏడు పోర్టుల నిర్మాణం విషయంలో జగన్ సర్కార్ సీరియస్ గా స్పందిస్తున్నట్లే లెక్క. ఇదే క్రమంలో విశాఖను ఐటీ హబ్బ్ గా మార్చే విషయంలో కూడా జగన్ సర్కార్ ముందుకు కదులుతుంది. అలాగే… ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం భాగస్వాములను చేసుకోబోయే జపాన్ కంపెనీలద్వారా… సోలార్‌ విద్యుత్‌ పార్కుల ఏర్పాటు, ఆక్వాకల్చర్‌ అభివృద్ధి, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్ల ఏర్పాటులో పెట్టుబడులకు పరిపూర్ణమైన అవ‌కాశం ఉంటుంది అనేది పెద్దలు చెబుతున్న మాట.

సో… ఇంతకాలం జగన్ చేస్తున్న సంక్షేమ పథకాలను “జనాల అకౌంట్లలో డబ్బులు వేయడం మినహా జగన్ చేసిందేమీలేదు” అని.. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ఇకపై ఆప్షన్ ఉండదని అంటున్నారు విశ్లేషకులు. అటు సంక్షేమం.. ఇటు అభివృద్ధి విషయాల్లో జగన్ దూసుకుపోతే ఇక ఎలాంటి ఇబ్బందులూ ఉండవనేది వారి మాటగా ఉంది!

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!