‘పారదర్శకంగా ఇసుక విక్రయాలు’

Share

విజయవాడ: పారదర్శకంగా ఇసుక విక్రయాలు, తరలింపు ఉండాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. కృష్ణా జిల్లా రొయ్యూరు ఇసుక రీచ్‌ని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. రీచ్‌లో ఇసుక తవ్వకాలను పరిశీలించిన మంత్రి రోజుకు ఎంత ఇసుక వెలికితీస్తున్నారు, ఏ మేరకు వినియోగదారులకు అందిస్తున్నారు అనే విషయాలను మైనింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఇసుక రీచ్‌లో డిమాండ్‌ను బట్టి అదనంగా మిషన్ లను ఏర్పాటు చేయాలంటూ అధికారులకు ఆదేశించారు.

ఆన్ లైన్లో ఇసుక బుక్ చేసిన వినియోగదారులతో, ఇసుకను రవాణా చేస్తున్న లారీ యజమానులతోనూ మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇసుక తరలింపు లో ఎటువంటి జాప్యం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇసుక తూకం,ధరల్లో ఎటువంటి అవకతవకలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.


Share

Related posts

విజయవాడ లాక్ డౌన్ కి సిపి ద్వారకా తిరుమల రావు గారు తీసుకున్న చర్యలు

Siva Prasad

Mahesh Ntr: గురువుగారు అంటూ ఎన్టీఆర్ పై పంచ డైలాగ్ వేసిన మహేష్ బాబు..!!

sekhar

పెట్రోల్ పై 10 రూపాయలు డీజిల్ పైన 13 రూపాయలు పెంచిన కేంద్రం

Siva Prasad

Leave a Comment