NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

RK Roja: మంత్రి ఆర్కే రోజాకు మరో సారి షాక్ ఇచ్చిన సొంత పార్టీ నేత .. ఈ సారి టికెట్ కష్టమేనా..?

RK Roja: చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో మంత్రి ఆర్కే రోజా నాయకత్వాన్ని బలమైన నేతలు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్కే రోజాకు టికెట్ ఇస్తే ఓడిస్తామని కూడా వ్యతిరేక వర్గం బహిరంగంగానే ప్రకటించారు. నియోజకవర్గ పరిధిలోని వడమాలపేట మండలం అప్పలాయిగుంటలో సచివాలయం, పత్తిపుత్తూరులో రైతు భరోసా కేంద్రం, జగనన్న పాల సేకరణ కేంద్రాలను మంత్రి రోజా త్వరలోనే ప్రారంభించాలని అనుకున్నారు.

అయితే ఈ విషయం తెలుసుకున్న వడమాలపేట జడ్పీటీసీ సభ్యుడు మురళీధర్ రెడ్డి ఆదివారం ఆ మూడు కార్యాలయాలను ప్రారంభించి రోజాకు షాక్ ఇచ్చారు. గతంలోనూ పత్తిపుత్తూరులో సచివాలయ భవనం ప్రారంభోత్సవానికి మంత్రి రోజా ఏర్పాట్లు చేసుకోగా, తనకు బిల్లులు ఇవ్వకుండా ప్రారంభం చేయకూడదంటూ మురళీధర్ రెడ్డి తాళం వేశారు. ఇటీవల జడ్పీ సమావేశంలోనూ రోజాకు వ్యతిరేకంగా పలువురు జడ్పీటీసీ సభ్యులు నిరసన గళం వినిపించారు.

మంత్రి రోజా కొన్నాళ్లుగా మురళీధర్ రెడ్డితో పాటు పుత్తూరు కు చెందిన వైసీపీ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి ఏలుమలై, నగరి మున్సిపాలిటీ మాజీ చైర్మన్ కేజే కుమార్, నిండ్ర కు చెందిన శ్రీశైలం దేవస్థానం చైర్మన్ చక్రపాణి రెడ్డి, విజయపురానికి చెందిన లక్ష్మీపతిరాజు, ఈడిగ కార్పోరేషన్ చైర్మన్ కేజే శాంతి తదితర ముఖ్యనేతలను దూరం పెట్టారు. అప్పటి నుండి ఇరువర్గాల మధ్య తరచూ విభేదాలు రచ్చకెక్కుతూనే ఉన్నాయి. నియోజకవర్గంలోని నేతలు ఆమె నాయకత్వాన్ని వ్యతిరేస్తుండటంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఎటువంటి చర్యలు చేపడతారనే దానిపై పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది.

ఇప్పటికే టీడీపీ అభ్యర్ధిగా గాలి భానుప్రకాశ్ ను చంద్రబాబు ప్రకటించారు. గత ఎన్నికల్లో కేవలం 2,708 ఓట్ల ఆధిక్యతతోనే భాను ప్రకాష్ పై ఆర్కే రోజా గెలిచారు. అంతకు ముందు 2014 ఎన్నికల్లోనూ రోజా గాలి ముద్దు కృష్ణమ నాయుడుపై కేవలం 858 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ తరుణంలో గత ఎన్నికల్లో ఆమెకు మద్దతుగా పని చేసిన నేతలు వ్యతిరేకంగా మారడంతో రోజాకు టికెట్ ఖరారు చేయడం కష్టమేనని అంటున్నారు. చూడాలి ఏమి జరుగుతుందో..!

author avatar
sharma somaraju Content Editor

Related posts

Breaking: విజయవాడలో సీఎం జగన్ పై రాయితో దాడి .. ఎడమ కంటి పైభాగంలో గాయం

sharma somaraju

YS Jagan: జగన్ బస్సు యాత్రలో అరుదైన అతిధి .. బస్సు యాత్రకు వైఎస్ భారతి సంఘీభావం

sharma somaraju

YS Jagan: ఇళ్ల పట్టాలు ఎందుకు ఆపిచ్చాడంటూ చంద్రబాబు నిలదీయండి – జగన్

sharma somaraju

అమ్మ, అత్త, ఒక అన్న, ఇద్దరు చెల్లెళ్లు.. వైఎస్ కుటుంబ గొడ‌వ‌ల్లో కొత్త ట్విస్ట్ ఇది..!

టీడీపీ – వైసీపీలో ఈ ఫ్యామిలీ ప్యాకేజ్ ప్ర‌చారాలు చూశారా…?

కంచుకోట‌లో టీడీపీని స్వ‌యంగా ఓడిస్తోన్న చంద్ర‌బాబు… !

వైసీపీలో ఈ సీట్లు మార్పు ఖాయం.. కేఈకి రిజ‌ర్వ్‌.. !

Congress: వైసీపీకి మరో ఎమ్మెల్యే రాజీనామా .. షర్మిల సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక

sharma somaraju

Telangana Lok Sabha Elections: కాంగ్రెస్, బీజేపీ హోరా హోరీ .. ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయంటే..?

sharma somaraju

Lok sabha Elections 2024: ప్రధాని మోడీ విమర్శలపై ఘాటుగా స్పందించిన మల్లికార్జున ఖర్గే .. రిప్లై ఇలా..

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Telangana Lok Sabha Election: వరంగల్ ఎంపీ అభ్యర్ధిని ప్రకటించిన బీఆర్ఎస్

sharma somaraju

AP Elections 2024: చంద్రబాబు నివాసంలో ఎన్డీఏ కూటమి నేతల కీలక సమావేశం .. ఎందుకంటే..?

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ కేసులో ప్రధాన నిందితుల అరెస్టు ..టోపీ ఆధారంగా నిందితుల పట్టివేత

sharma somaraju

Ananya: జ‌ర్నీ హీరోయిన్ అన‌న్య ఏమైపోయింది.. ఆమె ఆర్చరీలో స్టేట్ ఛాంపియన్ అని మీకు తెలుసా?

kavya N