NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Nimmagadda Ramesh Kumar : నిమ్మగడ్డ విషయములో స్టేట్ మొత్తం షాక్ అయ్యే రీతిలో వార్నింగ్ ఇచ్చిన కీలక మంత్రి..!!

Nimmagadda Ramesh Kumar : స్టేట్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం అధికార పార్టీ వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సంగతి తెలిసిందే.

minister strong counter to nimmagadda ramesh kumar
minister strong counter to nimmagadda ramesh kumar

గత ఏడాది స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం ఇప్పుడు తెరపైకి వచ్చినప్పటి నుండి..ఈ క్షణం వరకు వైయస్ జగన్ ప్రభుత్వానికి షాకుల మీద షాకులు ఇస్తున్నారు నిమ్మగడ్డ. ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు కంటే గడిచిన రెండు మూడు నెలలలో భారీ స్థాయిలో జగన్ ప్రభుత్వానికి నిమ్మగడ్డ మర్చిపోలేని రీతిలో కౌంటర్లు న్యాయ పరంగా అదేవిధంగా ప్రకటనల పరంగా ఇవ్వడం జరిగింది. రాజ్యాంగబద్ధ పదవిలో ఉండటంతో అటు వైసీపీ ప్రభుత్వానికి చెందిన నాయకులు మంత్రులు కూడా ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే పంచాయతీ ఎన్నికల విషయంలో ఎక్కడా కూడా ఏకగ్రీవాలు అవ్వకుండా కీలకంగా రాణిస్తున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ విషయంలో తాజాగా ఏపీ కీలక శాఖ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్టేట్ మొత్తం షాక్ అయ్యే వార్నింగ్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. మేటర్ లోకి వెళ్తే స్టేట్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ఇష్టానుసారం అయిన నిర్ణయాలు తీసుకుంటున్న నేపథ్యంలో ఆయన మాట ఎవరైనా వింటే ఊరుకునే ప్రసక్తి లేదని ప్రభుత్వ ఉద్యోగులకు ఊహించని రీతిలో హెచ్చరికలు జారీ చేశారట. నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాట విని ఎవరైనా పంచాయతీ ఎన్నికలలో అక్రమాలకు పాల్పడితే..మార్చి 31 తర్వాత వారిపై చర్యలు తప్పవని పెద్దిరెడ్డి స్పష్టం చేసినట్లు సమాచారం. ఎంతటి ఉన్నత అధికారులు అయినా చట్టపరంగా నడుచుకోవాలని..సూచించడం జరిగింది.

అందుకుగాను ఏకగ్రీవల విషయంలో వెంటనే డిక్లరేషన్ ఇవ్వాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టంచేశారు. అట్లా కాదని రిటర్నింగ్ అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే.. వైసీపీ ప్రభుత్వం ఉన్నంతకాలం బ్లాక్ లిస్టులో ఉంటారని ఊహించని వార్నింగ్ ఇచ్చారు. ఇదిలా ఉంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ సొంతంగా అందుబాటులోకి తీసుకొచ్చిన యాప్ ఫిబ్రవరి 9 వరకు వాడకూడదని హైకోర్టు స్పష్టం చేయటం హైలెట్ విషయంగా మారింది. వైసీపీ పార్టీ నాయకులు ముందు నుండి ఈ యాప్ విషయం పై అభ్యంతరం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇటువంటి క్రమంలో కోర్టు కూడా ఈ యాప్ విషయంలో అభ్యంతరం వ్యక్తం చేసే తరహాలో ఆపేయటం తో వైసీపీ మద్దతు దారులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

 

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!