Minister Suresh: చంద్రబాబు లోకేష్ లపై మంత్రి సురేష్ సూపర్ పంచ్!మేటర్ ఏంటంటే??

Share

Minister Suresh: ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్ లపై సూపర్ పంచ్ పేల్చారు.సాధారణంగా సురేష్ ప్రతిపక్షాలపై మర్యాదపూర్వకమైన విమర్శలు మాత్రమే చేస్తుంటారు.విద్యాధికుడు కావడంతో సురేష్ వ్యవహారశైలి రాజకీయ నాయకులకు భిన్నంగా ఉంటుంది.కానీ అలాంటి సురేష్ కే తండ్రీకొడుకులు ఎక్కడో మండించారు.దీంతో ఆయన మీడియా సమావేశంలోనే బరస్ట్ అయ్యారు.సత్యం రామలింగరాజుకు లింకు పెట్టి చంద్రబాబు, లోకేషులకు మంత్రి చురకంటించారు.

Minister Suresh Super Punch on Chandrababu And Lokesh!
Minister Suresh Super Punch on Chandrababu And Lokesh!

అసలు విషయమేంటంటే!

ఆంధ్రప్రదేశ్ లో ఎలాగైనా పదోతరగతి పరీక్షలు నిర్వహించాలన్న కృతనిశ్చయంతో వైఎస్ జగన్ ప్రభుత్వం ఉంది.కరోనా ఉద్ధృతి నేపధ్యంలో అనేక రాష్ట్రాలలో ఈ పరీక్షలను రద్దు చేయడం జరిగింది.జాతీయ స్థాయిలో అనేక పోటీ పరీక్షలను కూడా కేంద్రం రద్దు చేసింది.కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం పదో తరగతి పరీక్షల విషయంలో పట్టుదలతో ఉంది.కరోనా తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొన్నాకే ఈ పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం ముందు నుంచి చెబుతూనే ఉంది.వాస్తవానికి ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జూన్ ఏడో తేదీ నుండి ఈ పరీక్షలు జరగాల్సి ఉండగా ప్రభుత్వం వాయిదా వేసింది.తదుపరి పరిస్థితిని సమీక్షించాక పరీక్షల నిర్వహణపై తుది నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది.

పరీక్షలు రద్దు చేయాలంటూ టీడీపీ పట్టు!

అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఏడాది పదోతరగతి పరీక్షలు నిర్వహించరాదంటూ టీడీపీ పట్టుబడుతోంది.విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పంతానికి పోకుండా పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలని చంద్రబాబునాయుడు,లోకేష్ పదేపదే డిమాండ్ చేస్తున్నారు.ఇదే విషయమై వీరికి అనుకూలంగా ఉండే కొందరు హైకోర్టుకి కూడా వెళ్లినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.ఈ విషయంలో టీడీపీ వైఖరి ప్రభుత్వానికి చిరాకు తెప్పిస్తోంది

Minister Suresh: మంత్రి కామెంట్ మామూలుగా లేదుగా!

ఈ నేపథ్యంలో మంత్రి ఆదిమూలపు సురేష్ మంగళవారం మీడియా సమావేశం నిర్వహించి పదో తరగతి పరీక్షల విషయంలో ప్రభుత్వ వైఖరిని మరోసారి వివరించారు.కరోనా తగ్గాకే ఈ పరీక్షలు నిర్వహిస్తామని ,ఇందులో టీడీపీకి వచ్చిన అభ్యంతరం ఏమిటంటూ ఆయన ప్రశ్నించారు.ఇదే సందర్భంగా మంత్రి సురేష్ టీడీపీ నేత లోకేష్‌ తండ్రికి గతంలో సత్యం రామలింగరాజు దొరికినట్లు అందరు తండ్రులకు దొరకరుగా అంటూ సెటైర్‌ వేశారు. లోకేష్‌ తండ్రికి దొరికినట్లు అందరు తండ్రులకు సత్యం రామలింగరాజులు దొరకరని చెప్పడం ద్వారా గతంలో ఆయన సాయం లేకుండా లోకేష్‌ విద్యాభ్యాసం పూర్తయ్యేది కాదని సురేష్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.మరి ఈ కామెంట్ మీద చంద్రబాబు, లోకేష్ లు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి!

 


Share

Related posts

కేటీఆర్ కు పెరుగుతున్న స్వాగత బాజాలు!నిన్న మంత్రి.. నేడు ఎమ్మెల్యేలు!అంతా కెసిఆర్ వ్యూహమేనా?

Yandamuri

Today Gold Rate: జిగేల్ మంటున్న బంగారం, వెండి ధరలు.. ఆల్ టైమ్ గరిష్టస్థాయికి

bharani jella

Etela Rajender: బీజేపీలో చేరుడు ఖాయమే.. డౌట్‌లు క్లారిఫై చేసుకున్న ఈటల..!!

somaraju sharma