దాదాపు ఎనిమిది నెలలు తరువాత స్కూళ్లు మరియు కాలేజీలు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి. తాజాగా ఒక ప్రభుత్వ జూనియర్ కాలేజీలో విద్యార్థుల పెళ్లి సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. కాలేజీ సమయంలో క్లాస్ రూమ్‌లోనే పెళ్లి చేసుకున్నారు ఒక ప్రేమ జంట. వీరు ఇరువురు మైనర్ లు కాగా క్లాస్ రూమ్ లోనే అమ్మాయికి పసుపుతాడు కట్టి, నుదిటిపై బొట్టు పెట్టాడు ఆ అబ్బాయి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన నవంబర్ 17 న జరిగినట్లు తెలుస్తుంది.
ఈ సంఘటన అంతా మొబైల్లో వీడియో రికార్డ్ చేసుకున్నారు. వీడియో ని పరిశీలిస్తే పక్కనే మరికొందరు విద్యార్థులు ఉన్నట్లు అర్థం అవుతుంది. ఈ వీడియోని వారిలో ఒకరు లీక్ చేశారన్న అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు కాలేజీలో జరిగిన ఆ పెళ్లి వీడియోలు, ఫోటోలు వైరల్‌గా మారాయి. విషయం తెలుసుకున్న కాలేజీ ప్రిన్సిపాల్ ఇద్దరు విద్యార్థులకు గట్టి వార్నింగ్ ఇచ్చి వీరికి సహాయం చేసిన మరో విద్యార్థికి కూడా టీసీ ఇచ్చి కాలేజీ నుంచి ముగ్గురిని పంపించేశారు. మీరు ఈ పని చేస్తున్నప్పుడు మీ తల్లితండ్రులు గుర్తురాలేదా అంటూ నెటిజన్లు ఈ వైరల్ వీడియోలకి కామెంట్లు పెడుతున్నారు.