76 ఎళ్ల త‌ర్వాత ఆకాశంలో అద్భుతం.. ఎప్పుడు జరగనుందంటే?

శాస్త్ర విజ్ఙానం ఎంత వేగంగా అభివృద్ధిపథంలో దూసుకుపోతున్నా.. ఈ సృష్టిలో చేదించ‌ని ర‌హ‌స్య‌లు, వింత‌లు ఎన్నో ఉన్నాయి. ఇప్ప‌టికీ అవి మ‌న క‌ళ్ల ముందు జ‌రుగుతూనే ఉన్నాయి. శాస్త్ర‌వేత్త‌లు సైతం వాటిపై ప‌రిశోధ‌న‌లు కోన‌సాగిస్తూనే ఉన్నారు. ఇలానే చాలా సంవ‌త్స‌రాల త‌ర్వాత ఆకాశంలో మ‌రో సారి అద్భుతం జ‌ర‌గ‌బోతున్న‌ది. దాదాపు 76 సంవత్సరాల త‌ర్వ‌త ఇది చోటుచేసుకుంటుండ‌టంతో ఆ రోజుకోసం యావ‌త్ ప్ర‌పంచం ఎదురుచూస్తోంది. దేని గురించి అనుకుంటున్నారా? అదే నండి మ‌న మామ చంద‌మామ గురించే ! చాలా ఏళ్ల త‌ర్వ‌తా చంద్రుడు “బ్లూమూన్‌”గా ద‌ర్శ‌న‌మివ్వ‌బోతున్నాడు.

ఈ ఏడాదిలో ఇప్ప‌టికే ఆస‌క్తిక‌ర‌మైన ప‌లు ఖ‌గోళ ఘ‌ట‌న‌లు జ‌రిగాయి. ఈ నెలాఖ‌రున (అక్టోబ‌ర్ 30) చంద్రుడు బ్లూమూన్‌గా ద‌ర్శ‌న‌మిచ్చే అరుదైన దృశ్యం అవిష్కృతం కానున్న‌ది. 76 ఏళ్ల త‌ర్వ‌త జ‌రుగుతున్న ఈ అద్భుతాన్ని మీరు మిస్ చేసుకోకండి. ఈ రోజున ప్ర‌పంచంలోని చాలా దేశాల్లో అనేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు. బ్లూమూన్‌ను మ‌రింత సంద‌డిగా మారుస్తారు. భార‌త్‌లోనూ బ్లూమూన్ దృశ్యాల‌ను సామాన్య ప్ర‌జ‌లు సైతం చూడ‌టానికి కొన్ని సంస్థ‌లు ప్ర‌త్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి.

ఈ బ్లూమూన్‌ను ఉత్తర, దక్షిణ అమెరికా, ఆసియా, ఐరోపాలోని అనేక దేశాలలో వీక్షించవచ్చు. ఇలాంటి దృశ్యం మరోసారి 19 సంవత్సరాల తర్వాత అంటే 2039లో వచ్చే అవకాశాలు ఉన్నాయని ఖగోళ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. బ్లూ మూన్‌ అంటే చంద్రుడు పూర్తి నీలం రంగులోకి ఏం మారదు. రెండో ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు “బ్లూమూన్‌” ప్రపంచమంతటా కనిపించిందని చరిత్రకారులు చెబుతున్నారు. అలాగే ఏడాదిలో 12 పౌర్ణమిలు ఉంటుండగా.. ఈసారి 13 పౌర్ణమిలు రానుండటం గమనార్హం.

ఈ నేప‌థ్యంలో శాస్త్ర‌వేత్త‌లు సైతం ఈ బ్లూమూన్ కోసం ఆస‌క్తి ఎదురుచుస్తున్నారు. ఆ రోజు జ‌ర‌గ‌బోయే ప‌రిణామాల‌ను తెల‌సుకోవ‌డానికి వారి ప‌రిశోధ‌న కోసం ముమ్మ‌ర ఏర్పాట్లు సైతం చేసుకుంటున్నారు. కాగా, అమెరికా అంత‌రిక్ష ప‌రిశోధ‌న సంస్థ నాసా సైతం అక్టోబ‌ర్ 26న చంద్రునికి సంబంధించి కీల‌క ప్ర‌క‌ట‌న చేస్తామ‌ని వెల్ల‌డించింది. నాసా చంద‌మామా గురించి ఏమి చెబుతుందా అని అటు ప‌రిశోధ‌కులు, ఇటు సామాన్య జ‌నంలోనూ ఆస‌క్తి నెల‌కొన్న‌ది.