NewOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Munugode Bypoll: మునుగోడు నూతన ఆర్ఓ గా మిర్యాలగూడ ఆర్డీఓ

Share

Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా మిర్యాలగూడ ఆర్ డీ ఓ రోహిత్ సింగ్ నియమితులైయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. రోడ్ రోలర్ ఎన్నికల గుర్తు వివాదం నేపథ్యంలో రిటర్నింగ్ అధికారి (ఆర్ఒ)పై ఈసీ వెేసిన సంగతి తెలిసిందే. నిబంధనల ప్రకారం ఎన్నికల్లో ఒక సారి అభ్యర్ధులకు ఎన్నికల గుర్తులు కేటాయించిన తర్వాత వాటిని మార్చరు. ఒక వేళ మార్చాల్సిన అవసరం ఏర్పడితే కేంద్ర ఎన్నికల సంఘానికి సదరు అంశాన్ని తెలియజేసి వారి అనుమతితో రిటర్నింగ్ అధికారి ఎన్నికల గుర్తు మార్పుపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.

 

అయితే మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ ఆందోళన చేసిన నేపథ్యంలో రిటర్నింగ్ అధికారి .. యుగ తులసి పార్టీకి కేటాయించిన రోడ్డు రోలర్ గుర్తును మార్పు చేసి దాని స్థానంలో బేబీ వాకర్ గుర్తును కేటాయించారు. దీంతో డ్రాలో రోడ్ రోలర్ గుర్తు పొందిన యుగ తులసి పార్టీ అభ్యర్ధి శివకుమార్ ఈసీకి ఫిర్యాదు చేయడంతో ఈ సీ స్పందించింది. .

Advertisements

యుగ తులసి పార్టీ అభ్యర్ధి శివకుమార్ కు ఇది వరకు కేటాయించిన రోడ్డు రోలర్ గుర్తును పునరుద్దరించిన ఈసీ.. ఆర్ ఓ ను తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి రిటర్నింగ్ అధికారి నియామకం కొరకు ముగ్గురు అధికారులతో కూడిన నివేదిక పంపాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఇఓ)ను ఈ సీ ఆదేశించింది. సీఈఓ పంపిన జాబితాను పరిశీలించిన ఈసీ మిర్యాలగూడ ఆర్ డీఓ గా పని చేస్తున్న రోహిత్ సింగ్ ను నూతన ఆర్ ఓ గా నియమించింది.

Nagari: రోజా చుట్టూ ముళ్లు.. భానుకి కూడా ఔట్ ..!? నగరి మళ్లీ కష్టమే..!?


Share

Related posts

Karthikadeepam: దీపను అవమానించిన ఊరుజనం..!అండగా రాజ్యలక్ష్మి ఉంటుందా.. ఆమె కూడా మోనితనే సపోర్ట్ చేస్తుందా..!!

Ram

ట్రాక్టర్ ఎక్కి అనసూయ రచ్చ.. హైపర్ ఆదిని ఎలా భయపెట్టిందో చూడండి?

Varun G

Allu Arjun : “బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ” సాంగ్ కి అరుదైన అవార్డు..!!

sekhar