NewsOrbit
న్యూస్

కనబడుట లేదు :పేరు గల్లా జయదేవ్ -ఏపీ ఎంపీ!

గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కోసం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని మరీ వెతుకుతున్నారు.

 Missing Name Galla Jayadev AP MP
Missing Name Galla Jayadev AP MP

రెండు నెలలుగా ఆయన జాడ కనిపించడం లేదు పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికే జయదేవ్ చిరునామా దొరకడం లేదు. ఇక ప్రజల గురించి ప్రత్యేకంగా చెప్పడం అనవసరం కదా! నిజానికి జయదేవ్ మహా చురుకైన ఎంపీ గా పేరు తెచ్చుకున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఆయన ఢిల్లీలో లోక్సభలో తన గళాన్ని అతి బలంగా వినిపించే వారు. ప్రత్యేక హోదా పై లోక్ సభలో జరిగిన చర్చ సందర్భంగా జైదేవ్ చేసిన ప్రసంగం దేశం మొత్తాన్ని ఆకట్టుకుంది. అంతేకాకుండా అనేక రాష్ట్ర సమస్యలపై కూడా ఆయన పార్లమెంటులో బాగా మాట్లాడే వారు.

ఇక 2019 కి వచ్చేసరికి రాష్ట్రంలో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది ముగ్గురు టీడీపీ ముగ్గురు ఎంపీలు మాత్రం గెలిస్తే అందులో జయదేవ్ ఒకరు. దీంతో పార్టీ గెలిచిన ఎంపీ గల్లా జయదేవ్ పై ఆశలు పెట్టుకుంది. కానీ అనతికాలంలోనే టిడిపి ఆశలు అడియాశలు అయ్యాయి.గుంటూరులో గల్లా జయదేవ్ కార్యాలయం తెరచి ఉన్నప్పటికీ ఆయన మాత్రం అందుబాటులో లేరు. ఈ విషయం నారా చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా వెళ్లినప్పటికీ ఆయన కూడా ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారట!కరోనా సమయంలో ఆయన కన్పించడం లేదని పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు రాజధాని అమరావతి తరలింపు హాట్ హాట్ గా సాగుతున్న వేళ ఎంపీ గల్లా జయదేవ్ మాయమయ్యారు.

ఒక్కమాటలో చెప్పాలంటే గల్లా జయదేవ్ ఇప్పుడు గుంటూరుకు విజిిటింగ్ ఎంపీ!ఇప్పుడు టిడిపి విపక్షంలో ఉండటంతో పనిలేదనుకున్నారో? ఏమో గల్లా జయదేవ్ గుంటూరవు పార్లమెంటు నియోకవర్గాన్ని గాలికి వదిలేశాడు.అయితే దీనికి కారణం ప్రభుత్వం నుంచి వేధింపులు వస్తాయన్న భయంతోనేనని చెబుతున్నారు. గల్లా జయదేవ్ కుటుంబానికి చెందిన అమరరాజ్ సంస్థ భూములను ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. దాదాపు 253 ఎకరాలను వెనక్కు తీసుకుంది. అయితే దీనిపై గల్లా కుటుంబం హైకోర్టును ఆశ్రయించి స్టే తీసుకుంది. కానీ భవిష‌్యత్తులోనూ తమకు సమస్యలు ప్రభుత్వం నుంచి ఎదురవుతాయని భావించే గల్లా జయదేవ్ ప్రస్తుతానికి దూరంగా ఉంటున్నారని చెబుతున్నారు.

ఏదేమైనప్పటికీ తెలుగుదేశం పార్టీ చాలా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది ఉన్న ముగ్గురు ఎంపీలలొ కేశినేని నాని బిజెపి వైపు వెళ్తారని అంటున్నారు. గల్లా జయదేవ్ వరస ఏమో ఇలాగే ఉంది .ఇక మిగిలిన శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు తన బాబాయి అచ్చెన్నాయుడు కు ప్రభుత్వపరంగా ఎదురవుతున్న ఇబ్బందులు చూసి లోలోపల ఆయన కూడా ఆందోళన చెందుతున్నారని సమాచారం.మరిక ఈ ముగ్గురు టిడిపిలో ఉంటారా లేదా అన్నది భవిష్యత్తులో తేలుతుంది!

author avatar
Yandamuri

Related posts

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju