రాక్ స్టార్ యశ్ హీరోగా, కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో KGF చాప్టర్ 2 మూవీ కి ఆల్ ఇండియా లో ఎంత క్రేజ్ ఉందొ మనకి తెలిసిందే. KGF 1 బ్లాక్ బస్టర్ అవ్వడం తో అంతకన్నా ఎక్కువ ఎలేవేషన్స్ తో KGF చాప్టర్ 2 ని తెరకెక్కిస్తున్నారు. అయితే, జనవరి 8 న KGF చాప్టర్ 2’ టీజర్‌ను హీరో యశ్ పుట్టినరోజు సందర్భంగా ఉదయం 10:18 గంటలకు విడుదల చేస్తామని చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించారు. కానీ, ఆ టీజర్ సోషల్ మీడియాలో ముందే లీక్ కావడంతో, గురువారం రాత్రే టీజర్‌ను రిలీజ్ చేయవలసి వచ్చింది. అయితే KGF చాప్టర్ 2 టీజర్ ని చూసిన హీరో యష్ అభిమానులు మరియు ప్రేక్షకుల ఆనందానికి అవధులు లేకుండా అయిపోయింది.
హీరో యశ్ యాక్షన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో కలిసి ప్రేక్షకుల అంచనాల్ని మించిపోయాయి. ఇక ఈ టీజర్ తో KGF చాప్టర్ 2 సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అన్ని ప్రాంతాల వారికి అర్థమయ్యేలా ఇంగ్లిష్ లాంగ్వేజ్ లో మొన్న రాత్రి ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు.
ఈ టీజర్ విడుదలైన కేవలం గంట 52 నిమిషాలలో 10 మిలియన్స్‌కు పైగా వ్యూస్ ను చేరుకుంది. ఇక అలాగే తరువాత 12 గంటల్లో 15 మిలియన్స్‌కు పైగా వ్యూస్‌ని అందిపుచ్చుకుంది. ఇందులో ప్రధానంగా ఒక సీన్ మాత్రం తెగ వైరల్ అవుతుంది. హీరో రాఖీ బాయ్ పెద్ద మెషీన్ గన్‌తో పోలీసు జీపులను కాల్చి గాల్లోకి లేపిన తరువాత ఎర్రగా అగ్గిలా మారిన ఆ మెషీన్ గన్ గొట్టంతో సిగరెట్ వెలిగించుకున్నాడు. ఆ సీన్ లోని బాక్గ్రౌండ్ మ్యూజిక్ అలాగే ఎలేవేషన్స్ ఈ మూవీ పై మరింత ఆసక్తిని రేకెత్తించాయి.
Hero Yash: కన్నడ స్టార్ హీరో యశ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రాంకింగ్ స్టార్ గా అందరూ పిలుస్తూ…
Pakka Commercial: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్, ప్రముఖ డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `పక్కా కమర్షియల్`.…
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్‌గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…
Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `ఛలో`తో టాలీవుడ్లోకి అడుగు పెట్టి అనతి…
Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…
Breaking: వైసీపీ (YCP) ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) కు హైకోర్టు (AP High Court) లో…