ఫోన్ ట్యాపింగ్ అంశంపై వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరో అడుగు ముందుకు వేశారు. పోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దర్యాప్తు చేయించాలని కోరుతూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కు ఫిర్యాదు చేసినట్లు బుధవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. అయితే కోటంరెడ్డి ఆరోపించినట్లు అది ఫోన్ ట్యాపింగ్ కాదు, ఫోన్ రికార్డింగ్ అని ఇంతకు ముందు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తదితర వైసీపీ వైసీపీ పెద్దలు మీడియాకు వెల్లడించారు. వీరు చెప్పిన విషయమే వాస్తవమనీ, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన ఆరోపణల్లో నిజం లేదనే విధంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మిత్రుడే మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇచ్చారు.

ఇంతకు ముందు మీడియా సమావేశంలో ఫోన్ ట్యాపింగ్ కు చేశారు అనడానికి ఇది అధారం అంటూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి .. ఆయన మిత్రుడు రామశివారెడ్డితో మాట్లాడిన కాల్ వాయిస్ ను చూపించారు. తమ ఇద్దరి ఫోన్ లు ఐ ఫోన్ లు అని వీటిలో రికార్డింగ్ సౌకర్యం లేదని కోటంరెడ్డి చెప్పుకొచ్చారు. అయితే కోటంరెడ్డి స్నేహితుడు రామ శివారెడ్డి బుదవారం మీడియా ముందుకు వచ్చి కోటంరెడ్డి చేసిన ఆరోపణలను కొట్టిపారేశారు. వైఎస్ఆర్ కుటుంబానికి తాము మూడు దశాబ్దాలుగా అభిమానిస్తున్న వాళ్లమని చెప్పారు. జగన్మోహనరెడ్డి సర్కార్ పై అభాండాలు వేయడమే కాక కేంద్ర హోంశాఖకు ఫోన్ ట్యాపింగ్ అంటూ ఫిర్యాదు చేస్తున్న నేపథ్యంలో వాస్తవాలను తెలియజేయడానికి మీడియా ముందుకు వచ్చినట్లు చెప్పారు రామశివారెడ్డి.
ఈ విషయంలో తనను ఎవరు ప్రభావితం చేయలేదన్నారు. తనది అండ్రాయిడ్ ఫోన్ అని, ప్రతి కాల్ తన ఫోన్ లో రికార్డింగ్ అవుతుందని తెలిపారు. కోటంరెడ్డితో మాట్లాడిన కాల్ రికార్డింగ్ ను కాంట్రాక్టర్ అయిన తన స్నేహితుడికి షేర్ చేశాననీ, దాంతో బయటకు వెళ్లిందన్నారు. ట్యాపింగ్ అంటూ ఇంత వివాదం అవుతుందని తాను ఊహించలేదన్నారు. ట్యాపింగ్ అంటూ కోటంరెడ్డి హంగామా చేయడంతో వాస్తవాలను చెబుతున్నాననీ, అవసరం అయితే తన ఫోన్ ను ఫొరిన్సిక్ కు ఇచ్చేందుకు సిద్దమేనని రామశివారెడ్డి చెప్పారు. తమ ఇద్దరివి ఐఫోన్లు అన కోటంరెడ్డి అబ్బదం చెప్పారన్నారు. తనది అండ్రాయిడ్ పోన్ అని తెలిపారు. తనపై ఎవరి ఒత్తిడీ లేదనీ , వాస్తవాలను తెలియజేసేందుకే మీడియా ముందుకు వచ్చినట్లు వివరించారు రామ శివారెడ్డి.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సుప్రీం, హైకోర్టుల్లో తెలంగాణ సర్కార్ కు ఎదురుదెబ్బ