24.2 C
Hyderabad
February 5, 2023
NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Vidadala Rajini : ఎమ్మెల్యే విడదల రజని పీఏ వద్దే లంచం గుంజిన వైనం!సీన్ కట్ చేస్తే?

Share

Vidadala Rajini : చిల‌క‌లూరిపేట రిజిస్ట్రార్ కార్యాలయాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళించేశారు.

mla rajini pa bribed by government official
mla rajini pa bribed by government official

ద‌శాబ్దాలుగా పాతుకుపోయిన అవినీతిపై స్థానిక శాస‌న‌స‌భ్యురాలు విడ‌ద‌ల ర‌జిని గ‌ట్టిగా గొడ్డ‌లి పెట్టులాంటి వేటు వేశారు. ప్రైవేటు సిబ్బందితో భారీగా వ‌సూళ్ల‌కు పాల్ప‌డుతూ అక్ర‌మాల‌కు అడ్డాగా మారిన చిల‌క‌లూరిపేట రిజిస్ట్రార్ కార్యాల‌యానికి గ‌ట్టిగా బుద్ధిచెప్పారు. ఆస్తుల క్ర‌య‌విక్ర‌యాల‌కు సంబంధించి రిజిస్ట్రార్ కార్యాల‌యానికి వ‌చ్చే వారి నుంచి సిబ్బంది భారీ వ‌సూళ్ల‌కు పాల్ప‌డుతున్నార‌నే ఆరోప‌ణ‌లు చిల‌క‌లూరిపేటలో ఎప్ప‌టి నుంచో ఉన్నాయి. టీడీపీ హ‌యాం నుంచి ఈ విమ‌ర్శలు బ‌లంగా వినిపిస్తున్నా ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. అప్ప‌టి ప్ర‌జాప్ర‌తినిధుల క‌నుస‌న్న‌ల్లోనే రిజిస్ట్రార్ కార్యాల‌యంలో అవినీతి కార్య‌క‌లాపాలు కొన‌సాగాయ‌ని అంటుంటారు. ప్ర‌తి నెలా చిల‌క‌లూరిపేట స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యం అక్ర‌మ ఆదాయం రూ.25ల‌క్ష‌ల‌కు పై మాటే అని అక్క‌డి సిబ్బందే చెబుతుండ‌టం గ‌మ‌నార్హం. ఈ డ‌బ్బులో ఎవ‌రి వాటాలు వారికి అందేవ‌ని చెబుతుంటారు. గ‌తంలో ప్ర‌జాప్ర‌తినిధుల‌కు కూడా వారి వాటా వారికి అందేద‌నే ఆరోప‌ణ‌లు గుప్పు మంటున్నాయి.

Vidadala Rajini : దృష్టి సారించిన ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జిని

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చాక రిజిస్ట్రార్ కార్యాల‌యంలో అవినీతి కార్య‌క‌లాపాలు కొంత‌వ‌ర‌కు త‌గ్గాయ‌ని తొలుత ప్ర‌చారం జ‌రిగినా.. మ‌ళ్లీ ప‌రిస్థితి మొద‌టికే వ‌చ్చింద‌ని ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జిని గ్ర‌హించారు. త‌న పీఏ వ‌ద్ద‌నే లంచం తీసుకున్నార‌ని తెలిసిన ఎమ్మెల్యే జ‌న‌వ‌రి 25వ తేదీ శ‌నివారం రిజిస్ట్రార్ కార్యాల‌యాన్ని ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. రూ.వెయ్యి లంచం తీసుకున్న‌ట్లు జూనియ‌ర్ అసిస్టెంట్ రాఘ‌వ అక్క‌డే ఒప్పుకోవ‌డం విశేషం. దీనిపై ఎమ్మెల్యే తీవ్రంగా ఆగ్ర‌హావేశాలు వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే. ప‌రిస్థితి ఇలానే ఉంటే మీపై క‌ఠిన చ‌ర్య‌ల‌కు ఆదేశిస్తామ‌ని ఆ స‌మయంలో ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. ఆ వెంట‌నే ఉన్న‌తాధికారుల‌కూ ఫిర్యాదుచేశారు.

రంగంలోకి జిల్లా (న‌ర‌స‌రావుపేట‌) రిజిస్ట్రార్‌

ఎమ్మెల్యే త‌నిఖీల నేప‌థ్యంలో చిల‌క‌లూరిపేట‌లో ప్ర‌జ‌ల నుంచి ర‌క్తం పీల్చుకుతుంటున్నార‌ని గ్ర‌హించిన జిల్లా (న‌ర‌స‌రావుపేట‌) రిజిస్ట్రార్ మాధ‌వి సోమ‌వారం రిజిస్ట్రార్ కార్యాల‌యాన్ని హుటాహుటిన సంద‌ర్శించారు. అక్క‌డ క‌నీసం రికార్డులు కూడా స‌క్ర‌మంగా లేవ‌ని గ్ర‌హించారు. కార్యాల‌యంలో ఏకంగా ఐదుగురు వ‌ర‌కు ప్రైవేటు సిబ్బంది అన‌ధికారికంగా నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ప‌నిచేస్తున్నార‌ని తెలిసి నివ్వెర‌పోయారు. వారెవ‌రూ కార్యాల‌యానికి రావ‌డానికి వీల్లేద‌ని హుకుం జారీ చేశారు. కార్యాల‌యంలో అవినీతికి కేంద్రంగా నిలుస్తున్న జూనియ‌ర్ అసిస్టెంట్ రాఘ‌వపై బ‌దిలీ వేటు వేశారు. న‌ర‌స‌రావుపేట ఏపీకి అత‌డికి స్థాన చ‌ల‌నం క‌లిగేలా ఆదేశాలు జారీచేశారు. ద‌శాబ్దాలుగా పేరుకుపోయిన రిజిస్ట్రార్ కార్యాల‌య అవినీతిపై గ‌ట్టిగానే వేటు ప‌డింద‌ని స్థానికులు ఆనందం వ్య‌క్తంచేస్తున్నారు. చిల‌క‌లూరిపేట ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జిని ప‌నితీరుపై హ‌ర్షం వ్య‌క్తంచేస్తున్నారు.

 


Share

Related posts

Bigg Boss 5 Telugu: మరోసారి యానీ మాస్టార్ వర్సెస్ ఉమాదేవి..!!

sekhar

టాలీవుడ్ యువ హీరో పై కేసు నమోదు..!!

sekhar

బిగ్ బాస్ బ్యూటీ దివి కి మెగాస్టార్ చిరంజీవి బంపర్ ఆఫర్ ..!

GRK