NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

రాపాక సారూ.. ఎమిటీ వ్యాఖ్యలు..! ఇది సోషల్ మీడియా యుగం.. ఆడేసుకుంటారు..!!

Share

ఎవరైనా నాయకుడు ఎన్నికల్లో గెలవాలంటే అనేక రకాల వ్యూహాలు అనుసరిస్తుంటారు. ఎన్నికలో ప్రచారం, ప్రలోభాలు ఏ పార్టీకి అయినా కామన్. ఇక ప్రత్యర్ధులపై దుష్ప్రచారం, ఎదుటి వాళ్లు ఇచ్చిన వాటి కంటే ఎక్కువ ఇవ్వడం, తన సామాజిక వర్గ ఓట్లు మిస్ కాకుండా చూసుకోవడంతో పాటు కీన్ కంటెస్ట్ ఉన్న సందర్భంలో దొంగ ఓట్లు వేయించుకోవడం సహజమే. ప్రత్యర్ధి బలవంతుడైనే అడ్డుకుంటారు. ప్రత్యర్ధి బలహీనుడైతే ఇవి నడిచిపోతుంటాయి. చాలా పోలింగ్ బూత్ ల వద్ద దొంగ ఓట్లు వేయడానికి వచ్చిన వాళ్లను పార్టీల నేతలు పట్టుకుని పోలీసులకు అప్పగించినా అక్కడ నుండి పంపంచి వేస్తారే కానీ వారిపై కేసులు నమోదు చాలా తక్కువ. దొంగ ఓట్లు వేయించుకోవడం చాలా నియోజకవర్గాల్లో జరుగుతుంది. అది ఆయా పార్టీల నేతలకు తెలిసే జరుగుతుంది. కానీ ఈ విషయాలను ఎవరూ బహిరంగంగా మాట్లాడరు. కానీ గత ఎన్నికల్లో జనసేన నుండి గెలిచిన ఏకైన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తన గెలుపు రహస్యాన్ని బహిర్గతం చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. జనసేన పార్టీ అభ్యర్ధిగా గెలిచిన తర్వాత రాపాక వరప్రసాద్ అధికార వైసీపీకి మద్దతుగా మారిన సంగతి తెలిసిందే.

Rapaka Varaprasad

 

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో తనను కొనుగోలు చేసేందుకు టీడీపీ వాళ్లు బేరసారాలు జరిపారంటూ ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచిన రాపాక ..మరో సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఓటు కోసం పెద్ద ఎత్తున డబ్బు ఆఫర్ చేశారంటూ టీడీపీ వాళ్లపై బాంబ్ పేల్చిన రాపాక.. ఇప్పుడు తనకు తానే బాంబ్ వేసుకున్నారు. ఇంతకు ముందు చేసిన వ్యాఖ్యలు టీడీపీని అభాసుపాలు చేసేవిగా ఉంటే, తాజా చేసిన వ్యాఖ్యలు తన ప్రతిష్టే దెబ్బతినే విధంగా ఉన్నాయి. దీంతో ఆయన సెల్ఫ్ గోల్ చేసుకున్నట్లు అయ్యింది. తాను దొంగ ఓట్లతో గెలిచాను అన్నట్లుగా వ్యాఖ్యలు చేశారు. ఓ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ తన సొంతూరు చింతలమూరులో తన అనుచరుల ఒకొక్కరు పది పదిహేను దొంగ ఓట్లు వేశారని చెప్పారు. మా ఇంటి దగ్గర బూత్ లో కాపుల ఓట్లు ఉండవనీ, అన్నీ ఎస్సీల ఓట్లే ఉంటాయనీ, ఎవరో ఎవరికీ తెలియదనీ, తన అనుచరులు జట్టుగా వచ్చి దొంగ ఓట్లు వేసేసి వెళ్లిపోయే వాళ్లని అన్నారు. మెజార్టీ ఏకంగా ఎనిమిది వందల ఓట్లతో గెలిచినట్లు చెప్పారు. వీళ్లు అలా చేయకపోతే తాను ఓటమి పాలయ్యేవాడినని అన్నారు.

ప్రస్తుతం ఆయన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వార్తలపై టీడీపీ నేతలు పైర్ అవుతున్నారు. రాపాక వరప్రసాద్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు బహిరంగ సభలు, సమావేశాల్లో మాట్లాడే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. టంగ్ స్లిప్ అయి మాట్లాడితే .. వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేసేస్తారు. ఇంతకు ముందు అయితే మీడియా వాళ్లు ఉంటేనే కాస్త జాగ్రత్తగా మాట్లాడుతుంటే వాళ్లు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా యుగం నడుస్తొంది. ప్రతి ఒక్కరి వద్ద స్మార్ట్ ఫోన్ ఉంటోంది. ఆ ఫోన్ లతో ఎవరో ఒకరు నాయకులు మాట్లాడే మాటలను రహస్యంగా వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసేస్తున్నారు. అందుకే నాయకులు బహిరంగ సభల్లో జర జాగ్రత్త లు పాటించాల్సిన అవసరం గుర్తెరగాలి.

చంద్రబాబు – జగన్ కు మధ్య తేడా ఇదీ .. ఇందుకు ‘దటీజ్ జగన్’ అనాల్సిందే(గా)..!


Share

Related posts

Rajamouli: “RRR” కంటే అతిపెద్ద సౌత్ ఇండియా క్రేజీ కాంబినేషన్ ప్రాజెక్ట్ రాజమౌళి..??

sekhar

తెలుగు రాష్ట్రాల్లో కోడ్ కూసింది

sarath

‘బాబుపై దాడి దుర్మార్గం’

somaraju sharma