NewsOrbit
న్యూస్

ఇన్నేళ్లలో లేనిది .. రామోజీ కి బిగ్ బ్యాడ్ నేమ్!

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన వార్తల్లో “రామోజీ సంస్థల్లో ఉద్యోగులకు ఉద్వాసన” అనే వార్త మరింత సంచలనంగా మారుతుంది. ఉదయం లేస్తే “ఈనాడు” ద్వారా ప్రజల కష్టసుఖాలు గురించి నీతులు చెప్పడతో మొదలయ్యే రామోజీ ప్రయాణం… తాజాగా తన సంస్థలోని చిన్న ఉద్యోగులపై నిరంకుసత్వంగా వ్యవహరిస్తున్నారని కథనాలు వెలుగులోకి వస్తున్నాయి. అలాంటి సంఘటన తాజాగా ఆన్ లైన్ వేదికగా హల్ చల్ చేస్తుంది.

ఈనాడులో ఉషోదయా పబ్లికేషన్స్, ఉషోదయా ఎంటర్ ప్రైసెస్ అనే రెండు విభాగాల గురించి పూర్తిగా తెలిసినవారెవరికైనా… హోదా ఎంత పెద్ద్దదైనా వారికి వారు “చిన్న ఉద్యోగులు” గానే ఫీలవుతుంటారు ఉషోదయా ఎంటర్ ప్రైజెస్ ఉద్యోగులు! ఈ క్రమంలో ఇక ఎం.ఎం.పీ.ఎల్. గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు! ఎందుకంటే… పబ్లికేషన్స్ తో పోల్చితే వారి జీతాల్లో వ్యత్యాసం అలా ఉంటుంది మరి! ఈ క్రమంలో.. కరోనా దెబ్బకి రామోజీ సామ్రాజ్యం వివిల్లాడుతోండుతుందనే సందర్భంలో… మార్గదర్శి మార్కెటింగ్ ప్రై. లి. (యం.యం.పి.ఎల్.) స్టాఫ్ కొందరు రామోజీకి లేఖరాశారు! ఇప్పుడు ఈ లేఖ సంచలనంగా మారింది.

రామోజీ గ్రూప్ ఛైర్మన్ గారికి పాదాభివందనం అంటూ మొదలైన లేఖలో… “మెమందరం గత కొన్ని దశాబ్ధాలుగా వివిధ శాఖల్లో, వివిద హోదాల్లో పనిచేస్తూ సంస్థ పురోభివృద్ధికి, ఆర్థిక పరిపుష్టికి మా శాయశక్తులా కృషిచేస్తూ విధులను నిర్వహించాము. ప్రస్తూతం కోవిడ్ – 19 ప్రకృతి వైపరిత్యం రూపంలో దాపురించి.. ఉద్యోగస్తులను తగ్గించుకునే నేపథ్యంలో మమ్మల్ని తొలగించదలచిరి. కరోనా మహమ్మారి విషయంలో స్పందించిన మీరు రెండు తెలుగు రాష్ట్రాలకు సుమారు 20కోట్ల రూపాయలు విరాళం అందజేస్తిరి. అటువంటి ఉదార స్వభావం కలిగిన మీకు మా కుటుంబాలను ఆదుకోగల శక్తిసామర్ధ్యాలు ఉన్నాయి. ఈ క్రమంలో… ప్రతీ ఉద్యోగికి సెటిల్ మెంట్ తో పాటు ప్యాకేజీని ఇప్పించవలసిందిగా కోరుచున్నాము” అంటూ రిక్వస్ట్ చేసుకున్నారు!

ఇలా ఉద్యోగులను.. చిన్న చిన్న ఉద్యోగులను.. దశాబ్ధాలుగా సేవలందిస్తున్న ఉద్యోగులను తొలగించడానికి రామోజీ గ్రూపు చెప్పే సమధానం… కరోనా కారణంగా సంస్థ సంక్షోభంలో పడిందని! దీనికి ప్రతిగా… రామోజీరావుకి వున్న సామ్రాజ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే… నాలుగు నెలల సంక్షోభం అనేది పెద్ద విషయం కాదన్నది చాలామంది అభిప్రాయంగా ఉంది. మరి రామోజీ ఈ లేఖలపైనా, ఉద్యోగుల ఆర్తనాధాలపైనా ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి!!

Related posts

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju