Mobile Recharge: 30 రోజుల రీఛార్జ్ ప్లాన్ 28 రోజులకు ఎందుకు కుదించారు? మాస్టర్ బిజినెస్ ప్లాన్ ఇదే!

Share

Recharge Plan Validity: మనకు గతంలో 30 రోజుల రీఛార్జ్ ప్లాన్ ఉండేది. కానీ ఇపుడు ఇక్కడ దాదాపు అన్ని టెలికాం ఆపరేటర్లు 30 రోజులకు బదులు 28 రోజులు వ్యాలిడిటీతో నెలవారీ రీఛార్జ్ ప్లాన్లను ఆఫర్ చేస్తున్నారు. అలాగే ఒక నెల కావచ్చు, 2 లేదా 3 నెలలైనా వారు 28 రోజుల ప్రకారమే లెక్కగడుతున్నారు. ఉదాహరణకు 3 నెలలకి రీఛార్జ్ ప్లాన్‌ను యాక్టివేట్ చేసుకుంటే సాధారణంగా 90 రోజుల బదులు 84 రోజులు మాత్రమే ఇస్తున్నారు. అయితే ఈ 28 రోజుల వ్యాలిడిటీ తీసుకురావడం వెనుక పెద్ద మాస్టర్ బిజినెస్ ప్లాన్‌నే ఉంది మరి.

ఆ మాస్టర్ బిజినెస్ ప్లాన్ పైన ఓ లుక్కేయండి!

ఇలా 30 రోజులకు బదులు 28 రోజులకు వ్యాలిడిటీ ఇవ్వడం వల్ల టెలికాం కంపెనీలకు కొన్ని వేల కోట్ల లాభం చేకూరుతోంది. ఎలా అంటే, సంవత్సరానికి 365 రోజులు.. ఈ సంఖ్యను 28తో భాగిస్తే మనకు 13 వస్తుంది. ఇలా సంవత్సరానికి 12 నెలలు కదా. లెక్క ప్రకారం, వీరు మాత్రం మనతో 13 సార్లు రీఛార్జ్ చేయించుకుంటున్నారు. అంటే మనం అదనంగా ఒక నెల ఎక్స్ట్రా రీఛార్జ్ చేసుకుంటున్నాం. ప్రస్తుతం గణాంకాల ప్రకారం చూస్తే ఈ విధానంలో వాళ్ళు వేళా కోట్లు గడిస్తున్నారు.

ఈ విధానం వలన సదరు కంపెనీల ఆదాయం ఇలా ఉంటుంది..

మనం చేసుకుంటున్న 13వ రీఛార్జీతో ఎయిర్‌టెల్‌ కంపెనీ సుమారు రూ.5415 కోట్లు సంపాదిస్తోంది. ఇక వొడాఫోన్ ఐడియా రూ.2934 కోట్లు, రిలయన్స్ జియో రూ.6168 కోట్లు వరకు సంపాదిస్తున్నాయి. ప్రతి ఏడాదిలోని 11 నెలలు 30 లేదా 31 రోజులు కలిగి ఉంటాయి కదా. అయితే నెలకి 28 రోజులు ఇవ్వటం వల్ల ప్రతి నెలలో 2 నుంచి 3 రోజుల వరకు కంపెనీ ఆదా చేసుకుంటుంది. మిగిలిన ఆ రోజులన్ని మనం కలిపితే 29 రోజులు వస్తాయి. ఈ 29 రోజులకు మళ్లీ కస్టమరు ప్రత్యేకంగా డబ్బులు చెల్లిస్తున్నాడు. ఈ డబ్బే టెలికాం కంపెనీలకు లాభం అవుతోంది.


Share

Related posts

సిఎం జగన్‌కు చంద్రబాబు లేఖ

somaraju sharma

Oxygen: భూమి మీద ఆక్సిజన్ లెవెల్స్ తగ్గి ప్రాణులు అంతరించిపోనున్నాయా ???

Naina

సీఎం X న్యాయవ్యవస్థ : బీజేపీ చోద్యం చూస్తుందా..? చక్కదిద్దుతుందా..!?

Srinivas Manem