NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఏపీ రాజధాని వ్యవహారంలోకి మోడీ ఎంటర్ అయిపోయాడు? ఇక ప్రతిపక్షాలకు పండగే?

Share

ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానులను ఏర్పాటు చేసేందుకు అవసరమైన బిల్లు పై ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దానితోపాటు సీఆర్డీఏ చట్టం రద్దు పై కూడా ఆయన ఆమోదాన్ని తెలిపారు. జగన్ రెండుసార్లు అసెంబ్లీలో ఈ బిల్లును ప్రవేశపెట్టి ఆ తర్వాత మండలి కి ఫార్వర్డ్ చేయగా.. అక్కడా టీడీపీ మెజారిటీ ఉండడంతో ఆ బిల్లుకు అక్కడే అడ్డుకట్ట పడింది. అయితే దానిని సెలెక్ట్ కమిటీకి పంపాలని ఆదేశించినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ వ్యవహారాన్ని జాప్యం చేయడంతో పాటు చివరికి మొత్తం బాధ్యతలు తీసుకొని వెళ్ళి గవర్నర్ భుజాలపైన వేసింది. ఆయన వారికి అనుకూలంగా స్పందించాడు.

 

అయితే ఇంతకు ముందే కేంద్ర ప్రభుత్వం అసలు ఈ గొడవంతా ఎందుకు….? రాజధాని వికేంద్రీకరణ లో రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలు కొన్ని ముడిపడి ఉన్నాయి కాబట్టి దీనిని రాష్ట్రపతి ఆమోదం కోసం పంపమని కూడా కోరినా… జగన్ అలా చేయకుండా ముందు గవర్నర్ వద్దకు వ్యూహాత్మకంగా ఈ బిల్లుని పంపడం జరిగింది. అయితే ఇక్కడ ఇప్పుడు టిడిపి వారు ఈ విషమై హైకోర్టుకు వెళ్తామని అంటున్నారు. అక్కడ వారికి వ్యతిరేకంగా తీర్పు రావడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఆ తర్వాతి అంశంగా సుప్రీంకోర్టు వారి వద్దకి మరింత బలమైన వాదనతో వెళ్తే ఈ విషయంపై కేంద్రాన్ని దృష్టి కేంద్రీకరించవలసిందిగా…. లేడా సదరు మంత్రికి ఆ బాధ్యతలు అప్పగించే అవకాశం రావచ్చునని అందరి అభిప్రాయం.

ముందు ఏపీ బీజేపీ నేతలతో మోడీ ఇది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని అంశమని తాము కలగజేసుకోవడానికి లేదని చెప్పినా… దాని తర్వాత వ్యూహాత్మకంగా రాష్ట్రపతి నిర్ణయం కోరమని చెప్పారు. ఇప్పుడు రాజధాని వికేంద్రీకరణకి రాష్ట్ర విభజన చట్టం ముడి పెట్టినట్లయితే పూర్తిగా జగన్ కు వ్యతిరేకంగా నిర్ణయం రాకపోవచ్చు కానీ ఈ రాజధాని విషయాన్ని మరి కొద్ది కాలం సాగదీయవచ్చు. ఈ సాగతీత చాలు చంద్రబాబుకి ఏదో ఒక పాయింట్ పట్టుకుని జగన్ ని ఇబ్బంది పెట్టేందుకు. కాబట్టి జగన్ కూడా అటూ ఇటుగా చంద్రబాబు కి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే గవర్నర్ వద్ద పక్కా ప్లాన్ తో ఆమోదం తెచ్చుకున్నారు. అయితే మోడీ డైరెక్ట్ గా ఇన్వాల్వ్ కావడం కన్నా ఏపీ బీజేపీ నేతలతో లేదా చంద్రబాబు చేసే తర్వాతి కార్యాచరణలో వేలు పెట్టెందుకు మొగ్గు చూపుతున్నారని ఢిల్లీ నుండి వార్తలు వచ్చాయి. ఎంతైనా మోడీకి తెలుగు రాష్ట్రాలపై ఉండే మోజు వేరు.


Share

Related posts

Karthika Deepam Mar 19 Today Episode: తప్పుచేసిన హిమ ఇంట్లోకి.. సౌర్య బయటకు ఇదెక్కడి న్యాయం సౌందర్య గారు..!

Ram

బిగ్ బాస్ 4 : ఈ వారం బిగ్ బాస్ ఇతనిని ఘోరంగా టార్గెట్ చేశాడు..! ఎలిమినేషన్ పక్కా…? 

arun kanna

RGV: మీకు మీ డ్రైవర్ కి తేడా లేదా? జగన్ ని నిలదీసిన RGV!

Ram