పెన్షన్ తీసుకునే వారికి శుభవార్త… లైఫ్ స‌ర్టిఫికెట్‌పై కేంద్రం కీలక నిర్ణయం!

కేంద్ర ప్ర‌భుత్వం పెన్ష‌న్ తీసుకునే వారి కోసం మంచి శుభ‌వార్త‌ను అందించింది. సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ పెన్ష‌న్ దారులు తమ లైఫ్ స‌ర్టిఫికెట్‌ను స‌మ‌ర్పించ‌డానికి గ‌డువును పోడిగించింది కేంద్ర ప్ర‌భుత్వం. ఇది పెన్ష‌న్ తీసుకుంటున్న వారికి కాస్త ఊర‌ట క‌లిగించే విష‌య‌మ‌నే చెప్ప‌వ‌చ్చు. తమ జీవ‌న్ ప్ర‌మాణ్ ప‌త్రాన్ని స‌మ‌ర్పించ‌కుండానే పిన్ష‌న్ దారులు త‌మ‌కు ల‌భించే ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్రంలో ఉన్న బీజేపీ ప్ర‌భుత్వం తాజాగా తీసుకున్న నిర్ణ‌యం ప్ర‌కారం.. వ‌చ్చే సంవ‌త్స‌రం (2021) ఫిబ్ర‌వ‌రి నెలాఖ‌రులోగా (28) పెన్ష‌న్ పొందుతున్న వారు త‌మ లైఫ్ స‌ర్టిఫికెట్‌ను స‌మ‌ర్పించ‌వ‌చ్చు. లైఫ్ స‌ర్టిఫికెట్‌ను స‌మ‌ర్పించ‌డానికి చివ‌రి తేదీ ఈ ఏడాది న‌వంబ‌ర్ 1 గా ఉన్న‌ది. అయితే, ఇదివ‌ర‌కే ప్ర‌భుత్వం దానిని ఈ ఏడాది చివ‌రి నెల డిసెంబ‌ర్ 31 వ‌ర‌కూ పొడిగించింది. తాజాగా రెండో సారి ఈ గ‌డువును పెంచింది.

ప్ర‌స్తుతం వ‌చ్చే సంవ‌త్స‌రం రెండో నెలాఖ‌రు వ‌ర‌కూ పొడిగిస్తూ.. నిర్ణ‌యం తీసుకుంది. దీంతో పెన్ష‌న్ దారులు ఆందోళ‌న‌కు గురికాకుండా.. త‌మ జీవ‌న్ ప్ర‌మాణ్ పత్రాన్ని స‌మ‌ర్పించేందుకు మ‌రో మూడు నెల‌ల గ‌డువు ల‌భించింది. ఈ స‌మ‌యంలో లైఫ్ స‌ర్టిఫికెట్‌తో సంబంధం లేకుండా పెన్ష‌న్ ను అందిస్తారు. పెన్ష‌న్‌దారుల విన‌తుల నేప‌థ్యంలోనే ఈ నిర్ణ‌యం తీకున్నట్టు ప్ర‌భుత్వం వెల్ల‌డించింది.

అలాగే, జీవ‌న్ ప్ర‌మాణ్ ప‌త్రాన్ని అందించ‌డానికి ప‌లు వెసులుబాటులు కూడా క‌ల్పించింది ప్ర‌భుత్వం. లైఫ్ స‌ర్టిఫికెట్‌ను ఆన్‌లైన్ లో సమర్పించే స‌దుపాయ‌న్ని క‌ల్పించింది. అలాగే, ఎదైనా బ్యాంక్‌లోనూ త‌మ స‌ర్టిఫికెట్‌ను పెన్ష‌న‌ర్లు అందించ‌వచ్చున‌ని కేంద్రం తెలిపింది. క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ నేప‌థ్యంలో ప్ర‌జ‌లను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌నీ, క‌రోనా మ‌హ‌మ్మారి నిబంధ‌న‌ల‌ను అంద‌రూ త‌ప్ప‌కుండా పాటించాల‌ని కేంద్రం సూచించింది.