29.2 C
Hyderabad
March 21, 2023
NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

తెలంగాణకు ప్రధాని మోడీ గుడ్ న్యూస్ .. బీజేపీ రాజకీయ ఎత్తుగడలో భాగమే(నా)..?

Share

కేంద్రంలోని మోడీ సర్కార్ మొదటి నుండి బీజేపీ పాలిత రాష్ట్రాలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుందనీ, ఇతర రాష్ట్రాల పట్ల సవతి తల్లి ప్రేమ చూపుతుందని విపక్షాలు విమర్శలు చేస్తూనే ఉంటాయి. తెలంగాణలోని అధికార బీఆర్ఎస్, కేంద్రంలోని బీజేపీ మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే భగ్గు మనే పరిస్థితి ఉంది. మోడీపై బీఆర్ఎస్, కేసిఆర్ కుటుంబంపై బీఆర్ఎస్ తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నాయి. అటు తమిళనాడులో స్టాలిన్ సర్కార్ కూడా కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై విమర్శలు చేస్తూనే ఉంది. గవర్నర్ ల వ్యవస్థను అడ్డం పెట్టుకుని రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం చేస్తొందని విమర్శిస్తున్నారు. అయితే తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలను సిద్దం చేస్తొంది.

KCR Modi

 

రాబోయే ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు కైవశం చేసుకుని కేసిఆర్ కు బిగ్ షాక్ ఇచ్చేందుకు కమలనాధులు పావులు కదుపుతున్నారు. అటు తమిళనాడు ఏఐఏడీఎంకేతో జత కట్టి బలోపేతం కావాలని భావిస్తున్నది. ఈ క్రమంలోనే కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఓ కీలక అడుగులు వేసింది. దేశ వ్యాప్తంగా ఏడు రాష్ట్రాలకు కేంద్రం మెగా ప్రాజెక్టులను ప్రకటించింది. పీఎం మిత్ర (ప్రధాన మంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్ టైల్ రీజియన్ అండ్ అపారెల్ పార్క్) టెక్స్ టైల్ పార్క్ లను ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. టెక్స్ టైల్ పార్క్ లు ఏర్పాటు చేస్తున్న రాష్ట్రాల్లో కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలతో పాటు తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు ఉన్నాయి.

టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటుతో లక్షలాది మంది రైతులకు, చేనేత కార్మికులకు ఉపాధి, వేలాది మంది యువతకు ఉద్యోగాలు లభించనున్నాయి. పీఎం మిత్ర మెగా టెక్స్ టైల్ పార్కులు టెక్స్ టైల్ రంగానికి అత్యాధునిక మౌలిక సదుపాయాలను కల్పిస్తాయని మోడీ చెప్పారు. కోట్లాది పెట్టుబడులను ఆకర్షిస్తాయని, లక్షలాది ఉద్యోగాలను సృష్టిస్తాయని తెలిపారు. ఇది మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్ కి గొప్ప ఉదాహరణ అవుతుందని ట్విట్టర్ లో పేర్కొన్నారు మోడీ. ఇటీవల తెలంగాణలోని అధికార బీఆర్ఎస్ .. కేంద్రంలోని బీజేపీ రాష్ట్రానికి ఏమి చేసిందని ప్రశ్నిస్తున్నారు. ప్రజలను ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతారని అంటున్నారు. ఈ మెగా ప్రాజెక్టును రాబోయే ఎన్నికల్లో ప్రచార ఆస్త్రం గానూ బీజేపీ నేతలు వాడుకోనున్నారు. ఈ పార్క్ ప్రధాన మంత్రి మోడీ తెలంగాణకు అందించిన కానుక అని కూడా రాష్ట్రానికి చెందిన కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డి పేర్కొంటూ, రాష్ట్ర ప్రజల తరపున ప్రధాని మోడీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

నాలుగేళ్లలో మొదటి సారి టీడీపీలో ఉత్సాహం .. రెండు పట్టభద్రుల స్థానాల్లో టీడీపీ విజయంతో..


Share

Related posts

బ్రేకింగ్ : గవర్నర్ 3 రాజధానుల నిర్ణయం తర్వాత టీడీపీకి మరో పెద్ద షాక్!

arun kanna

Pesticides: అసలు పురుగు మందులు వాడని పండ్లు ఇవే!!

siddhu

BREAKING: ఇవాళ సాయంత్రం ఒకే స్టేజి మీద ఆమిర్‌ఖాన్‌, చిరంజీవి..!

amrutha