NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Modi Govt: రాష్ట్రాలకు బిగ్ షాక్ ఇచ్చిన కేంద్రం..ముఖ్యమంత్రులు ఏమంటారో..?

Modi Govt: దేశంలోని అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. ఇప్పటికే పలు రాష్ట్రాలపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తుందన్న విమర్శ ఉంది. దీనికి తోడు ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్ చెప్పింది కేంద్రం. ఇకపై ఏ సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చినా కేంద్ర ప్రభుత్వం నుండి కేవలం 60 శాతం నిధులు మాత్రమే వస్తాయని స్పష్టం చేసింది. మిగిలిన 40 శాతం నిధులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే భరించాల్సి ఉంటుందని కేంద్రం తెలిపింది.

Modi Govt: ప్రాజెక్టులో 40 శాతం రాష్ట్ర ప్రభుత్వాలు ముందుగా ఖర్చు చేయాలి

ఇక్కడ మరొక ట్విస్ట్ కూడా ఉంది. కొత్త నిబంధనల ప్రకారం తొలుత రాష్ట్రాలు తమ వాటా నిధులను విడుదల చేసి ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతనే కేంద్ర ప్రభుత్వ నిధులు విడుదల అవుతాయి. ఈ మేరకు తాజాగా కేంద్ర జలశక్తి శాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలను విడుదల చేసింది. జాతీయ ప్రాజెక్టులో 40 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు ముందుగా ఖర్చు చేయాలంటే అది రాష్ట్రాలకు తలకు మించిన భారమే అవుతుంది.

Modi Govt: ఇకపై ప్రాజెక్టులకు జాతీయ హోదా కష్టతరం

జాతీయ హోదా లభించిన ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం 90 శాతం నిధులను ఇస్తొంది. ఇప్పుడు ఈ మొత్తాన్ని 60 శాతంకు తగ్గించింది. అంతే కాకుండా కేంద్ర నిధులను పొందే ప్రక్రియ కూడా సంక్లిష్టంగా మారనుంది. ఇకపై జాతీయ హోదా కల్పించడం కూడా కష్టతరంగా మారనుంది. ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించేందుకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఆ నిర్ధిష్ట సమయంలో అందుబాటులో ఉన్న నిధులు, ప్రభుత్వ ప్రాధాన్యతలను బట్టే జాతీయ హోదా కల్పిస్తారు.

 

పోలవరంకు 60 శాతం నిదులేనా..?

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన తాజా నిబంధనలతో ఏపిలోని పోలవరం ప్రాజెక్టుకు కష్టాలు పెరిగే అవకాశాలు కనబడుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుండి 60 శాతం నిధులు మాత్రమే అందే అవకాశం ఉందన్నమాట. కేంద్రం తీసుకున్నఈ తాజా నిర్ణయంపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏ విధంగా స్పందిస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju