NewsOrbit
న్యూస్ ప్ర‌పంచం

Israel Modi: ఇజ్రాయిల్ కొత్త ప్రధానికి.. పదవి కోల్పోయిన వ్యక్తికి మోడీ ఇంగ్లీష్, హీబ్రూ భాషలలో శుభాకాంక్షలు..!!

Israel Modi: ఇజ్రాయిల్(Israel) పార్లమెంట్ రద్దు కావడంతో నాలుగు సంవత్సరాలలో ఐదోసారి ఎన్నికలకు రెడీ అవుతుంది. గత కొన్ని సంవత్సరాల నుండి ఇజ్రాయిల్ రాజకీయ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతుంది. వివిధ పార్టీలు కలిసి ప్రభుత్వాలను ఏర్పాటు చేసినప్పటికీ… విజయవంతంగా పరిపాలించలేని పరిస్థితి నెలకొంది. తాజాగా నఫ్తాలి బెన్నెట్(Naftali Bennett).. ప్రభుత్వం.. పార్లమెంట్ లో మద్దతు కూడగట్టడంలో విఫలం కావడంతో.. ప్రధాని పదవిని కోల్పోవాల్సి వచ్చింది. గత రెండు నెలల నుండి ఇజ్రాయిల్ పార్లమెంట్ లో మెజారిటీ లేకుండానే బెన్నెట్ అధికారంలో కొనసాగడం జరిగింది. ఈ క్రమంలో చర్చలు నిర్వహిస్తుండగా.. పార్లమెంటు రద్దు కావడం జరిగింది.

Israel to hold 5th general election in 3 yrs after coalition collapses -  Social News XYZ

ఈ పరిణామంతో నాలుగేళ్ల వ్యవధిలో.. ఇజ్రాయిల్ లో ఐదోసారి ఎన్నికలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. బెన్నెట్ కి ముందు ప్రభుత్వం ఏర్పాటు చేసిన బెంజమిన్ నేతన్యహు… ప్రభుత్వం కూడా గత ఏడాది జనవరిలో కూలిపోయింది. ఇదిలా ఉంటే కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఇజ్రాయిల్ ఆపధర్మ ప్రధానమంత్రిగా యయిర్ లపిడ్‌ కొనసాగునున్నారు. ఇటువంటి తరుణంలో కొత్త ప్రధాని యయిర్ లపిడ్‌(Yair Lapid) కి దేశ ప్రధాని మోడీ శుక్రవారం అభినందనలు తెలియజేశారు. ఇజ్రాయిల్ అధికార భాష హీబ్రూ, ఇంగ్లీష్ భాషలలో యయిర్ లపిడ్‌ కి శుభాకాంక్షలు తెలిపారు.

యయిర్ లపిడ్‌ ఇజ్రాయిల్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినందుకు హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇరుదేశాల మధ్య సంపూర్ణ దౌత్య సంబంధాలను ఏర్పరచుకొని 30 సంవత్సరాల సంబరాలను జరుపుకుంటున్న విషయాన్ని గుర్తు చేస్తూ.. మరింతగా భారత్ మరియు ఇజ్రాయిల్ దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యం పటిష్టంగా కొనసాగించాలని కోరారు. ఇక ఇదే సమయంలో ప్రధాని పదవి నుండి దిగిపోయిన బెన్నెట్ నీ ఉద్దేశించి.. భారతదేశానికి నిజమైన మిత్రునిగా వ్యవహరించినందుకు ధన్యవాదాలు అని పేర్కొన్నారు. మనిద్దరి మధ్య జరిగిన విజయవంతమైన సంభాషణలను.. నేను ఎప్పటికీ మర్చిపోలేను. భవిష్యత్తులో మీరు విజయం సాధించాలని కోరుకుంటున్నాను అని మోడీ సోషల్ మీడియాలో కామెంట్లు చేయడం జరిగింది.

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju