NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ

Modi : ఛాయ్ వాలా చావగొడుతున్నాడే…! అయినా నోరెత్తకుండా బాదుడు భరించాల్సిందే…?

Modi :  మోదీ కేంద్రంలో తొలిసారి గద్దె ఎక్కినప్పుడు ఒక ఛాయ్ వాలా కి అధికారం ఇచ్చాముఇకనైనా మార్పు వస్తుందని సామాన్య ప్రజానీకం తెగ సంబరపడిపోయారు. దశాబ్దాల నుండి కాంగ్రెస్ పాలనతో విసిగిపోయిన వారంతా బిజెపికి ఓట్లు వేశారు. పేదరికం నుండి వచ్చిన మోడీని తమవాడిగా కలిపేసుకున్నారు. అయితే ఇప్పుడు అదే మోడీ దేశంలో ధరలు పెంచుతూ ఉంటే రోదించడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. 

కష్టం తెలిసిన వాడు…. పేదరికం అనుభవించిన వాడు అని ఓట్లు వేస్తే విచ్చలవిడిగా సంస్థలను ప్రజల పైకి వదిలేసి సామాన్య ప్రజల నుండి డబ్బులు దోచేస్తున్నాడని మోడీ నెమ్మదిగా విమర్శలు కొని తెచ్చుకున్నాడు. ప్రస్తుతం మోడీ సర్కార్ కేంద్రంలో వ్యవహరిస్తున్న తీరును చూసి ప్రజలు ఆగ్రహావేశాలు అవుతున్నాయి. 

 

Modi sarkar troubling people
Modi sarkar troubling people

Modi : ఆరేళ్ళలో దాదాపు మూడు రెట్లు….

అసలు 2014కు ముందు కాంగ్రెస్ హయాంలో 14 కేజీల సబ్సిడీ వంటగ్యాస్ సిలిండర్ ధర 344.75 రూపాయలు. బీజేపీ ప్రభుత్వం వచ్చాక ఆ ధర కాస్తా కొంచెంకొంచెంగా పెరుగుతూ పోయింది. నిన్న రాత్రి మరొక 25 రూపాయలు పెంచడంతో ఇప్పుడు అది కాస్తా రూ. 846 చేరింది. పేరుకే సబ్సిడీ గ్యాస్ సిలిండర్ కానీ దేశంలో దాని ధరకి కూడా రెక్కలు వచ్చాయి. పెట్రోల్ డీజిల్ ధరల గురించి ఎంత తక్కువ ప్రస్తావిస్తే అంతమంచిది. ఒక్కో సిలిండర్ పై 25 రూపాయల చొప్పున పెంచుతూ బుధవారం రాత్రి చమురు సంస్థలు కొత్త ధర ని నిర్దేశించాయి. పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని కూడా పేర్కొన్నారు.

Modi : బాదుడే బాదుడు

సామాన్యుడి స్థాయికి అందకుండా పెరిగిపోతున్న ధరలు గురించి బిజెపి ప్రభుత్వం ఏమీ మాట్లాడడం లేదు. ఫిబ్రవరి లో మొత్తం మూడు సార్లు గ్యాస్ ధరలను పెంచింది మోడీ సర్కార్. ఫిబ్రవరి 4వ తేదీన ₹25, 15వ తేదీన ₹50 పెంచింది. తాజాగా బుధవారం రాత్రి మరో 25 రూపాయలు పెంచడం జరిగింది. ఒక్క నెలలోనే 100 రూపాయలు సబ్సిడీ గ్యాస్ సిలిండర్ మీద పెంచారు అంటే ఈ ప్రభుత్వం ఎంత సమర్థవంతంగా పని చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. 

వీళ్ళు బాధ్యులు కాదా..?

ఇక నిత్యావసరాల ధరలు కూడా చుక్కలను అంటాయి. 50 నుండి 80 రూపాయల మధ్య ఉన్న గోధుములు, నూనె, పప్పుల 50 నుంచి 100 రూపాయలకు పెరిగాయి. దీనిపై ప్రజలు ఎంత విలపిస్తున్నా మోడీ సర్కార్ లో ఎలాంటి చలనం లేదు. పెట్రోల్, డీజిల్ ధరలు చేతికి అందకుండా దూసుకుపోవడం ఎప్పుడు ఆగిపోతాయో ఎవరికీ స్పష్టత లేదు. అదేమన్నా అంటే గత ప్రభుత్వాల తప్పిదం ఇది అని నిలదీస్తున్నారు తప్ప మోడీ చేతికి అధికారం ఇచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా మార్పు తీసుకురాలేకపోయారు అనే విషయాన్ని మాత్రం ఒప్పుకోలేక పోతున్నారు. 

ఇదేంటి అని నిలదీస్తే దేశద్రోహి అని ముద్ర వేస్తున్నారు. వారి విధానాలను ప్రశ్నిస్తే ఇతను భారతీయుడు కాదు అని అంటున్నారు. దేశం కోసం…. ధర్మం కోసం సిద్ధాంతాన్ని ఇవన్నీ భరించాలి అని ప్రజల్లో నూరిపోస్తున్నారు. మరి ఎప్పటికైనా మోడీ సామాన్యుడి బాధని అర్థం చేసుకుంటాడా…?

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!