Modi: టీకా పంపిణీలో 100 కోట్ల.. మైలురాయి సాధించిన నేపథ్యంలో ప్రధాని మోడీ కీలక ప్రసంగం…!!

Share

Modi: ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా కలిగిన దేశం కావటంతో ఇండియాలో(India) కరోనా టీకా(Corona Vaccine) పంపిణీ కార్యక్రమం పూర్తి కావాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుందని.. ప్రపంచంలో చాలా దేశాలు అంచనా వేశాయి. కానీ వాళ్ళ అంచనాలను తలకిందులు చేస్తూ… కేవలం కొద్ది నెలల వ్యవధిలోనే.. భారత్ 100 కోట్ల టీకా డోసుల మార్క్ అందుకోవటం ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ సందర్భంగా భారత ప్రధాని మోడీ(Modi) జాతినుద్దేశించి ప్రసంగం చేశారు. వంద కోట్ల టీకా మార్క్.. దేశం అందుకోవడంలో ప్రజల కర్తవ్య దీక్ష ప్రధానమని చెప్పుకొచ్చారు. ఎక్కడా కూడా పేద ధనిక అనే వివక్షత చూపించకుండా ప్రతి ఒక్కరికి కరోనా టీకా అందించడం జరిగిందని… ఎన్నో సవాళ్లు ప్రశ్నలు.. అధికమించి వ్యాక్సినేషన్ లో వంద కోట్ల ఘనత.. సాధించడం జరిగిందని స్పష్టం చేశారు.Modi address highlights

భారత్ సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసింది..

ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి..(Corona Virus) మనకు కూడా అతి పెద్ద సవాల్ గా మారింది. అత్యంత జనాభా కలిగిన దేశం కావడంతో… వ్యాక్సినేషన్ పంపిణీ అనేది నిజంగా సవాలే. కానీ దాన్ని అధిగమించి నెలల వ్యవధిలోనే వందకోట్ల మైలు రాయి దాటడం వెనకాల ప్రజల సహకారం ఎంతో ఉంది. ఇది ప్రజల విజయం అని మోడీ(Modi) కొనియాడారు. కరోనా వ్యాక్సిన్ ల పంపిణీ ద్వారా భారత్(India) శక్తి మరోమారు ప్రపంచానికి తెలిసిందని స్పష్టం చేశారు. ముఖ్యంగా భారత ఫార్మా సామర్థ్యం.. దమ్మేంటో ప్రపంచ దేశాలకి ఈ మైలురాయి సాధించిన తర్వాత అర్థమైందని పేర్కొన్నారు. దేశ శాస్త్రవేత్తలు ఎంతో కృషి చేసి ప్రయాసపడి వ్యాక్సిన్లను అభివృద్ధి చేశారు. అనంతరం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వ్యాక్సిన్లను రూపొందించారు. స్వదేశీ శాస్త్రవేత్తల కృషి ఫలితంగానే… స్వదేశీ వ్యాక్సిన్లను అతిత్వరగా అందుబాటులోకి తీసుకు రాగలిగమనీ మోడీ(Modi) స్పష్టం చేశారు. సబ్ కా సాత్.. సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయస్ తోనే వందకోట్ల వ్యాక్సిన్ డోస్ ల లక్ష్యాన్ని సాధించినట్లు పేర్కొన్నారు.

UN agencies supporting mammoth India COVID-19 vaccine rollout | | UN News
పేద ధనిక తేడా లేకుండా…

 

వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమంలో ఎక్కడ వీఐపీ సంస్కృతికి ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రతి ఒక్కరిని సమానంగా చూసినట్లు మోడీ(Modi) స్పష్టం చేశారు. మహమ్మారి కరోనా పేద ధనిక అనే తేడా లేకుండా.. అందరిని అతలాకుతలం చేసింది ఈ క్రమంలో వ్యాక్సినేషన్ లో ఎక్కడా కూడా వివక్షత చూపించకుండా అందరికీ వ్యాక్సిన్లను అందించగలిగే రీతిలో వ్యవహరించాం. సాంకేతిక పరిజ్ఞానం వల్ల దేశంలో మారుమూల గ్రామాలకు కూడా కరోనా వ్యాక్సిన్ సరఫరా చేయడం జరిగిందని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశాలలో ఇప్పటికీ కూడా… వ్యాక్సినేషన్ (Corona Vaccine) పంపిణీ కార్యక్రమం.. అనేది ఇంకా పూర్తికాలేదు. అక్కడి ప్రజలు కూడా.. ప్రభుత్వాలకు సహకరించటం లేదు ముందుకు రావడం లేదు. కానీ మన దేశంలో 100 కోట్ల డోసులు వేయించటం వెనకాల …, అది కూడా ఉచితంగా.. అంటే ఖచ్చితంగా ఇది ప్రజల సహకారం వాళ్లనే. వాస్తవానికి బయట దేశాలు ఇండియా ని ఎప్పుడూ ఇతర దేశాలతో పోలుస్తూ ఉంటారు. ఈ క్రమంలో 100 కోట్ల మైలురాయి సాధించి ప్రపంచంలోనే తిరుగులేని దేశంగా భారత్ నిలిచింది అని.. మోడీ(Modi) స్పష్టం చేశారు.

India's Vaccination Drive Takes a Rural Turn, More than 60% Inoculations in Villages: Report

ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది…

 

దేశంలో వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం విజయవంతం కావడంతో దేశ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుందని మోడీ(Modi) చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో స్వదేశీ కంపెనీలకు పెట్టుబడులు బాగా వస్తున్నాయి. దీంతో దేశంలో ఉన్న యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభిస్తున్నాయి అని మోడీ చెప్పుకొచ్చారు.

COVID-19 Vaccine Tracker: 34.6 Lakh Doses Administered In India On June 16

అయినా అజాగ్రత్త వద్దు..

దేశంలో వందకోట్ల మైలు రాయి దాటినా గాని.. ఎక్కడా కూడా నిర్లక్ష్యం వహించిన వద్దు. ఇప్పటికీ కూడా కరోనా ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. ఈ నేపథ్యంలో వచ్చే దీపావళి పండుగను దేశ ప్రజలంతా జాగ్రత్తగా జరుపుకోవాలని మోడీ సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కరోనా నిబంధనలు ఎవరు మరువొద్దని పేర్కొన్నారు. ఒక్క డోస్ వేసుకొని వారికి ప్రాధాన్యం ఇవ్వాలని, వ్యాక్సిన్ వేసుకున్న వారు… ఇతరులను వేసుకునేలా ప్రోత్సహించాలని సూచించారు.


Share

Related posts

కంచె హీరోయిన్ ని క్రిష్ పట్టించుకోవడం లేదా ..?

GRK

Naga Shaurya: కేతికపై మనసు పారేసుకున్న నాగ శౌర్య..రొమాన్స్ చేయాలనిపిస్తుందంటూ కామెంట్స్..!

GRK

congress: తెలంగాణ కాంగ్రెస్ … ఢిల్లీలో ఓ కామెడీ

sridhar