NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్

మళ్లీ వచ్చేది నేనే : మోది

లేహ్, ఫిబ్రవరి 3: లక్ష్యసిద్ధి లేని సంస్కృతిని, రాజకీయాలను ఈ ఐదేళ్ల పాలనలో దేశం నుండి తరిమికొట్టామని ప్రధాని నరేంద్ర మోది అన్నారు. ఆదివారం జమ్ము, కాశ్మీర్‌లో మోది పర్యటించారు. విజయపూర్, అవంతిపురా డివిజన్‌లలో రెండు ఎయిమ్స్ ‌నిర్మాణాలకు మోది శంకుస్థాపన చేశారు. లడక్ యూనివర్శిటీని ప్రారంభించారు.

రాష్ట్రీయ ఉచ్చతర్ శిక్షా అభియాన్ (రూపా) కింద దేశ వ్యాప్తంగా కొత్త ప్రాజెక్టుకు ప్రారంభించారు. 54 డిగ్రీ కళాశాలలు, 11 ప్రొఫెషనల్  కాలేజీలు, ఒక మహిళా యూనివర్శిటీ నిర్మాణాలకు ప్రధాని మోది వీడియో కాన్షరెన్స్ ద్వారా శంకుస్థాపన చేశారు. కిస్టవర్, కుప్వారా, బారాముల్లాలో మూడు మోడల్ డిగ్రీ కాలేజీలకు ప్రధాని శంకుస్థాపన చేశారు.

క్రిస్టవర్‌లో చీనాబ్ నదిపై నిర్మించనున్న 624మెగావాట్ల కిరి హైడ్రో పవర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో ప్రధాని మోది మాట్లాడుతూ గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఈ ప్రాంతాన్ని పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. బిజెపి పాలనలో అబివృద్ధి ఇలాగే కొనసాగుతుందని మోది అన్నారు. 2019 ఎన్నికల్లోనూ విజయం సాధించి తానే ప్రధానిగా బాధ్యతలు చేపడతానని మోది ధీమా వ్యక్తం చేశారు.

‘నేడు నా చేతుల మీదుగా కొన్ని ప్రాజెక్టు శంకుస్థాపనలు జరిగాయి. ఆ ప్రాజెక్టుల ప్రారంభోత్సవం కూడా నేనే చేస్తాను’  అని మోది స్పష్టం చేశారు.

కేంద్ర ప్రభుత్వ సౌభాగ్య స్కీమ్ కింద జమ్ము కాశ్మీర్‌లో నూరు శాతం ఇళ్లకు కరెంటు సౌకర్యం ఏర్పాటు చేసిన ఘతన తమ ప్రభుత్వానిదేనని మోది  అన్నారు.

ఎలాంటి ఆలస్యం లేకుండా బడ్జెట్‌లో చిన్న సన్నకారు రైతులకు ప్రకటించిన సాయాన్ని వేగంగా అందజేసే ప్రక్రియ చేపట్టామని మోది తెలియజేశారు. మొదటి విడత సాయంగా అయిదు ఎకరాల్లోపు రైతులందరికీ రెండు వేల రూపాయల సాయం అందేలా కృషి చేస్తున్నామని మోది తెలిపారు. పథకం అమలు కోసం అర్హుల పేర్లు, ఆధార్ నెంబర్‌లు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలు జారీ చేశామని మోది అన్నారు.

మోది పర్యటన సందర్భంగా నాలుగు అంచెల భధ్రతా ఏర్పాట్లు చేశారు. సరిహద్దులో భద్రతను కట్టుదిట్టం చేశారు.

ప్రధాని మోది పర్యటనకు నిరసనగా వేర్పాటువాదులు బంద్‌కు పిలుపు నిచ్చారు.  దీంతో హురియత్ కాన్పరెన్స్ చైర్మన్ మిర్వయిజ్ ఉమర్ షరూఖ్‌ను పోలీసులు గృహ నిర్భంధంలో ఉంచారు.

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

Leave a Comment