మోదీ సభను అడ్డుకుంటాం- నక్క

మోదీ సభను తప్పనిసరిగా అడ్డుకుంటామని, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని మంత్రి ఆనందబాబు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని  మోదీ నాయకత్వంలోని బీజేపీ మోసం చేసిందని మంత్రి నక్కా ఆనందబాబు  విమర్శించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ పోలవరానికి కేంద్రం సహకారం అందించలేదని,  రైల్వే జోన్‌ ఇవ్వలేదన్నారు. విభజన హామీలను తుంగలో తొక్కారని విమర్శించారు.