NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Narendra Modi: గవర్నర్ల నియామకం లో మోడీ నయా రాజకీయం!ఇందిరాగాంధీని ఫాలో అవుతున్నారా?

Narendra Modi: ఒక్కో ప్రధానికి ఒక్కో స్టైల్ ఉంటుంది..ఎందరో ప్రధానులు ఉన్నప్పటికీ ఇందిరాగాంధీ మార్క్ రాజకీయం అప్పట్లో విభిన్నంగా ఉండేది.తల ఎగరేసినవారిని పదవుల నుంచి తప్పించడంలో ఆమె కొత్త పంథా అవలంభించేవారు.అయితే అలాంటి వారి అవసరం పడినప్పుడు మళ్లీ వారినే ఇందిరాగాంధీ అందలమెక్కించేవారు.ఇందుకు ఉదాహరణ మర్రి చెన్నారెడ్డి.రాజకీయంగా ఆయన చురుగ్గా ఉన్నప్పుడే ఇందిరాగాంధీ కొన్ని రాజకీయ కారణాలతో 1974 లో చెన్నారెడ్డిని ఉత్తరప్రదేశ్ గవర్నర్ చేశారు.

Modi's new politics in appointing governors!
Modis new politics in appointing governors

అయితే 1978 లో ఆంధ్రప్రదేశ్ లో ఇందిరా కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఆమెకు మళ్ళీ చెన్నారెడ్డే కావాల్సి వచ్చింది.ఆ ఎన్నికల్లో ఇందిరా కాంగ్రెస్ ఘనవిజయం సాధించగా మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు.1980లో చెన్నారెడ్డి పదవీచ్యుతుడయ్యారు.తిరిగి ఇందిరా గాంధీ ఆశీస్సులతో 1982 లో చెన్నారెడ్డి పంజాబ్ గవర్నర్ గా నియమితులయ్యారు. అదే చెన్నారెడ్డి 1989 లో ఇందిర కుమారుడు రాజీవ్ గాంధీ హయాంలో కూడా ఎన్టీఆర్ ప్రభంజనానికి అడ్డుకట్ట వేసి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వేరే విషయం.

Narendra Modi: ఇందిర రాజకీయాన్ని ఫాలో అవుతున్న మోడీ?

ఇప్పుడు ఇప్పుడు ఈ విషయాలన్నీ ఎందుకంటే ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇదే తరహాలో ఇందిరాగాంధీ రాజకీయాల్ని అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది.తనకు నచ్చని వారిని పదవి నుండి తప్పించి లూప్లైన్లో కి పంపించేయ్యటం మోడీ కి అలవాటుగా మారింది.తెలుగు రాష్ర్టాల్లో విశేషమైన క్రేజ్ కలిగిన వెంకయ్యనాయుడు ని కేంద్ర మంత్రి పదవి నుండి తీసేసి అలంకారప్రాయమైన ఉపరాష్ట్రపతి పదవికి మోడీ పరిమితం చేయటం తెలిసిందే.అలాగే ఎన్డీయే మొదటి టెర్మ్ లో బండారు దత్తాత్రేయను కేంద్ర మంత్రిగా తప్పించి గవర్నర్ గా నియమించారు. తాజా రాజకీయ పరిణామాలలోఈమధ్య జరిగిన మంత్రివర్గ విస్తరణలో పదవులు కోల్పోయిన ఇద్దరు కేంద్ర మాజీ మంత్రులకు గవర్నర్ పోస్టులు లభించాయి.

ఆ ఇద్దరూ ఎవరంటే?

కేంద్ర మంత్రి మండలి విస్తరణకు ఒకరోజు ముందే తన క్యాబినెట్లోని థావర్ చంద్ గహ్లాత్ కు గవర్నర్ పదవి ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. పరోక్షంగా ఆయన మంత్రి పదవి ఊడిందనే సంకేతం ఆ విధంగా ప్రధానిచ్చారు.ఇక విస్తరణలో పదవి కోల్పోయిన ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ని తాజాగా తమిళనాడు గవర్నర్ గా నియమించారు.పోతే ఇంకో కేంద్ర తాజా మాజీ మంత్రి సదానందగౌడను కూడా కర్నాటక సీఎంగా నియమించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.అదే జరిగితే ప్రస్తుత కర్నాటక సీఎం యడ్యూరప్ప ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా రాబోతున్నారన్న వదంతులు వినిపిస్తున్నాయి.ఇది మోడీ నయా రాజకీయంగా కనిపిస్తోంది.

 

author avatar
Yandamuri

Related posts

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N