NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Pawan Kalyan: అప్పుడు చూసుకుందాం పవన్ కళ్యాణ్ కి మోహన్ బాబు స్ట్రాంగ్ రిప్లై..!!

Pawan Kalyan: “రిపబ్లిక్”  సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో.. పవన్ కళ్యాణ్ వైసీపీ ని టార్గెట్ చేసుకుని చేసిన వ్యాఖ్యలు.. సినీ పరిశ్రమలో అదే రీతిలో.. ఏపీ రాజకీయాల్లో వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను వైసీపీ మంత్రులు తప్పుపట్టడం జరిగింది. సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్లే.. ఆన్ లైన్ టికెట్ బుకింగ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కోరినట్లు.. తెలియజేస్తూ ఒక సినిమా వేడుకను పొలిటికల్ మైలేజ్ కోసం పవన్ వాడుకున్నారని సెటైర్లు వేశారు. సినిమా ఇండస్ట్రీ మద్దతు తనకు ఉండే రీతిలో పవన్కళ్యాణ్ ఈ సినిమా టికెట్లు అనే అంశాన్ని అడ్డంపెట్టుకుని.. చీప్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నట్లు వైసీపీ నాయకులు మీడియా ముందు.. ఆయన చేసిన వ్యాఖ్యలపై కౌంటర్లు వేస్తున్నారు.

Image

ఇదిలా ఉంటే ఈ ప్రీ రిలీజ్ వేడుకలో.. వైసిపి కి మద్దతు తెలుపుతున్న మోహన్ బాబు .. ఈ విషయంలో కలుగజేసుకుని ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని అంత మాత్రమే కాక.. తన విద్యాసంస్థల ఫీజు చెల్లింపులు.. ఆన్ లైన్ ద్వారా పట్టించుకోవాలని ఆ విధానాన్ని తీసుకురావాలని… అంటూ మోహన్ బాబు పై సీరియస్ కామెంట్ చేశారు పవన్. ఈ తరుణంలో తన పై పవన్ చేసిన వ్యాఖ్యలకు మోహన్ బాబు.. సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

 

ఆయన ఏమన్నారంటే…“నా చిరకాల మిత్రుడి సోదరుడైన పవన్ కళ్యాణ్.. నువ్వు నాకంటే చిన్నవాడివి అందుకే ఏకవచనంతో సంభోదించాను. పవన్ కళ్యాణ్ గారు అనడంలో కూడా తప్పేమీ లేదు. చాలాకాలానికి నన్ను మెల్లగా లాగావ్. సంతోషమే. ఇప్పుడు ‘మా’ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. నా కుమారుడు విష్ణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా నిలబడ్డాడు అన్న విషయం తెలిసిందే. అక్టోబర్ 10వ తేదీన ఎలక్షన్స్ అయిపోతాయి. ఆ తర్వాత నువ్వు అడిగిన ప్రతి మాటకి నేను హృదయపూర్వకంగా సమాధానం చెబుతాను. ఈలోగా నువ్వు చేయాల్సిన ముఖ్యమైన పని… నీ అమూల్యమైన ఓటుని నీ సోదరసమానుడైన విష్ణు బాబుకి.. అతడి ఫ్యానల్‌కి వేసి వాళ్లని గెలిపించాలని కోరుకుంటున్నాను. థాంక్యూ వెరీ మచ్” అని మోహన్ బాబు పేర్కొన్నారు. దీంతో మా ఎలక్షన్ తర్వాత మోహన్ బాబు పవన్ చేసిన వ్యాఖ్యలకు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అన్నది ఇప్పుడు సంచలనంగా మారింది.

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!