అభిజీత్ ఆ మాట అంటాడని అనుకోలేదు! ఆ మాటను జన్మలో మర్చిపోలేను: మోనాల్

ప్రస్తుతం టాలీవుడ్ లో బిగ్ బాస్ షో లో పాల్గొన్నవాళ్లకు ఇండస్ట్రీలో అవకాశాలు తక్కువ అన్న టాక్ నడుస్తుంది. కానీ ఆ టాక్ ను నిజం కాదని ప్రూవ్ చెయ్యడానికే హౌస్ లోకి ఎంటరైందట మోనాల్ గజ్జర్. స్టార్ మా బిగ్ బాస్ షో లో పాల్గొన్నవారికి కూడా ఆఫర్లు వస్తాయని నిరూపిస్తాను అని ఆమె అనేక ఇంటర్వూస్ లో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మోనాల్ తాను అనుకున్నదే తడవు గా తన ఆలోచనలను ఇంప్లిమెంట్ చేస్తోంది.

ఆఖరుకి మోనాల్ తనకు బుల్లితెరలో వచ్చిన అవకాశాన్ని కూడా ఉపయోగించుకుంటుంది. ఈ నేపథ్యంలో ఆమె ఒక డాన్స్ షోకు జడ్జ్ గా వ్యవహరిస్తోంది. డాన్స్ ప్లస్ షో లో తన జడ్జ్మెంట్ ను వీర లెవెల్లో ఇచ్చిపడేస్తోంది. అలాగే, ఇటీవల విడుదల అయిన బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలో ఐటెం సాంగ్ లో తన పెర్ఫార్మన్స్ ను అదరగొట్టింది. ఆ సినిమాకి మొత్తం మీద టాక్ ఎలా ఉన్నా మోనాల్ గజ్జర్ స్పెషల్ సాంగ్ పెర్ఫార్మన్స్ కి మాత్రం మంచి మార్కులే పడ్డాయి.

ఇటీవల మోనాల్ ఒక సందర్భంలో తన ఎలిమినేషన్ కు గల కారణాన్ని బయట పెట్టింది. హోస్ట్ నాగార్జున మెహబూబ్ ఎలిమినేషన్ సందర్భంలో అభిజిత్ ను ‘ఈ వారం మెహబూబ్ ప్లేస్ లో ఎవరుంటారని ఎక్స్పెక్ట్ చేశావు’ అని అడగగా అందుకు అభిజిత్ ఏ మాత్రం ఆలోచించకుండా ‘మోనాల్’ అని సమాధానం చెప్పాడు. కేవలం అభిజిత్ ఇలా సమాధానం చెప్పడం వల్లనే తన ఎలిమినేషన్ జరిగిందేమో అని చెప్పుకొచ్చింది మోనాల్. అభిజీత్ ఆడియెన్స్ కు ముందుగానే ఈ విధంగా ఫీడ్ చేశాడని తన అనాలిసిస్ ను చెప్పుకొచ్చింది ఈ గుజరాతీ ముద్దుగుమ్మ. మొత్తంమీద బిగ్ బాస్ షో లో టాప్ 5లో ఉండకపోయినా అంతకన్నా ఎక్కువ బంపర్ ఆఫర్స్ ను పొందుతుంది మోనాల్.