Big Boss : బిగ్ బాస్ Big Boss సీజన్ ఫోర్ లో బాగా హైలెట్ అయిన వారిలో అఖిల్ ఆల్, మోనాల్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇద్దరూ కూడా హౌస్ లో ఫుల్ రొమాంటిక్ వాతావరణం క్రియేట్ అయ్యే రీతిలో గేమ్ ఆడటం జరిగింది. చాలావరకు బిగ్బాస్ సీజన్ ఫోర్ ఆడియన్స్ చూడటానికి గల కారణాలలో వీళ్లిద్దరూ కూడా అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హౌస్ లో బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ ఈ విషయంలో ఒకరు ఓడిపోయిన మరొకరు ప్రోత్సహించు కునే రీతిలో… ఫ్రెండ్షిప్ కంటే ఎక్కువ అన్న విధంగా రాణించడం జరిగింది. దీంతో సీజన్ ఫోర్ అయిపోయిన తర్వాత కూడా వీరిద్దరి ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతూ అనేక టెలివిజన్ షో లో చీఫ్ గెస్ట్ గా రావడం మాత్రమే కాక ఇండస్ట్రీలో కూడా రాణిస్తున్నారు.
ఇద్దరూ కలిసి ఇటీవల ఓ వెబ్ సిరీస్ కూడా యాడ్ చేయడం జరిగింది. ఇదిలాఉంటే ఇటీవల ఓ వెబ్ మీడియా చానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా యాంకర్ అఖిల్ కి సినిమా అవకాశాలు ఎందుకు రావడం లేదని ఎటకారంగా వేసిన ప్రశ్న కి పక్కనే ఉన్న మోనాల్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. అఖిల్ మల్టీ టాలెంటెడ్ పర్సన్ ఒకపక్క సింగర్ గా చేస్తూనే మరోపక్క సినిమా అవకాశాలు అందుకుంటున్నాడు…ఆల్రెడీ అప్పటికే కొన్ని పాటలు పాడటం జరిగింది అంటూ యాంకర్ కి కౌంటర్ గట్టిగా ఇచ్చింది.