ట్రెండింగ్ న్యూస్

కోరియోగ్రాఫర్ యష్ తో చిందులేస్తూ యష్ భార్యకు అడ్డంగా దొరికిపోయిన మోనల్?

monal dance with yash master in dance plus program
Share

మోనల్ గజ్జర్.. బిగ్ బాస్ 4 ముందు ఈ పేరు చాలామందికి తెలియదు. తెలుగులో ఐదు సినిమాలు చేసినప్పటికీ.. తను అంతగా ఫేమస్ కాలేదు కానీ.. ఎప్పుడైతే బిగ్ బాస్ సీజన్ 4లో అడుగుపెట్టిందో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. గుజరాత్ లో కూడా మోనల్ పేరు మారుమోగిపోతోంది.

monal dance with yash master in dance plus program
monal dance with yash master in dance plus program

బిగ్ బాస్ హౌస్ లోనూ తన ప్రేమాయణంతో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది మోనల్. అయితే.. బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చాక తనకు అదే స్టార్ మా చానెల్ లో డ్యాన్స్ ప్లస్ అనే ప్రోగ్రామ్ లో జడ్జిగా అవకాశం వచ్చింది.

ఇప్పటికే ఆ షో ప్రారంభం అయింది. ప్రతి శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు ఆ షో ప్రసారం అవుతుంది. అయితే.. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో మోనల్ గజ్జర్ చేసిన పనికి నెటిజన్లు అంతా షాక్ అవుతున్నారు. మరో జడ్జి, కొరియోగ్రాఫర్ యష్ తో కలిసి మోనల్ తెగ చిందులేసింది. తన భర్త యష్.. మోనల్ తో చిందులేస్తుంటే స్టేజి మీదికి వచ్చిన యష్ భార్య.. అతడిని అడ్డంగా బుక్ చేసేసింది. ఈ ఘటనతో యష్ షాకయ్యాడు. నా సంసారంలో నిప్పులు పోస్తున్నావు కదా అంటూ మోనల్ ను అనేసింది యష్ వైఫ్. యాంకర్ ఓంకార్ కూడా ఇంకొంచెం మసాలా యాడ్ చేసి.. వాళ్లిద్దరి కూడా ఉన్నది లేనిది చెప్పడంతో.. యష్ వైఫ్ అక్కడే బావురుమంది.

అయితే.. ఇదంతా ఏదో ఫన్ కోసం చేసిందే అయినా.. స్క్రీన్ మీద మాత్రం బాగానే వినోదం పండింది. మొత్తానికి మోనల్ టాలీవుడ్ లో ఫిక్స్ అయిపోయినట్టే. దానికి సంబంధించిన ప్రోమో వచ్చేసింది. మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి.


Share

Related posts

తిరుపతికి సమీపంలో కొనసాగుతున్న వాయుగుండం.

somaraju sharma

చిరంజీవి అభిమానులకు ప్రామిస్ చేసిన డైరెక్టర్ బాబీ..!!

sekhar

AP Assembly: పోలవరం ప్రాజెక్టుపై సీఎం వైఎస్ జగన్ కీలక ప్రకటన

somaraju sharma