అరియానా.. పేరు చెబితే చాలు వెరీ బోల్డ్, స్ట్రాంగ్ పర్సన్. అస్సలు ఏమాత్రం ఆలోచించకుండా.. ఎదుటి వారిని ముక్కుసూటిగా మనసులో ఏదున్నా అడిగేస్తుంది. ఏమాత్రం భయపడదు. టాస్క్ అంటే చాలు.. దూకుడే ఇక. ఇలాంటి మనస్తత్వం అరియానాది. అది సగటు ప్రేక్షకుడిగా మనం బిగ్ బాస్ చూసి అరియానాను అంచనా వేశాం.

కానీ.. గత వారం ఇంట్లో నుంచి బయటికి వచ్చిన మోనల్ మాత్రం అరియానా గురించి అసలు నిజం చెప్పేసింది. అరియానా గురించి ఒక పాజిటివ్, ఒక నెగెటివ్ చెప్పాలంటూ రాహుల్ సిప్లిగంజ్.. మోనల్ ను అడుగుతాడు.
దీంతో.. అరియానా పాజిటివ్ అంటే చాలా స్ట్రాంగ్.. చాలా కష్టపడుతుంది. టాస్క్ బాగా ఆడుతుంది అని చెప్పిన మోనల్.. నెగెటివ్ అనేసరికి.. అరియానాకు అస్సలు ఎమోషన్ ఉండదట. ఏమాత్రం ఎమోషన్ లేకుండా.. టార్చర్ పెట్టే టాస్క్ లో ఎంజాయ్ చేస్తుంది. టార్చర్ అనేసరికి ఎంతో సంతోషంగా.. ఆనందంగా చేస్తుంది… అంటూ ఇన్ డైరెక్ట్ గా అరియానాను సైకో అనేసింది మోనల్.
అంతే కాదు.. అరియానా సెల్ఫిష్ అని కేవలం తనగురించే ఎక్కువగా ఆలోచిస్తుందని.. వేరే వాళ్ల గురించి ఎక్కువగా ఆలోచించదని.. ఏ టాస్క్ అయినా సరే.. ముందు తనకు వచ్చే బెనిఫిట్ గురించే ఆలోచిస్తుందని.. మోనల్ చెప్పింది. అందుకే.. అరియానా అంటేనే హౌస్ లో అందరికీ భయం అంటూ తన మనసులో మాటను బయటపెట్టింది మోనల్.
ఇంకా మోనల్.. మిగితా కంటెస్టెంట్ల గురించి ఏం చెప్పిందో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూసేయండి మరి..